హుజూరాబాద్‌లో కొత్త నినాదం ఎత్తుకున్న అభ్య‌ర్థులు.. !

హుజురాబాద్ ఉపఎన్నికలో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.మొన్నటివరకు దళిత బంధు చుట్టూ తిరిగిన రాజకీయం నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం ఎవరెవరిపై ఎన్ని కేసులు నమోదయ్యాయనే అంశంపై ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య జోరుగా చర్చ నడిచింది.

 Candidates Adopt New Slogan In Huzurabad , Huzurabad, Etala Rajender-TeluguStop.com

నాపై ఇన్ని కేసులు నమోదయ్యాయి.ఉద్యమ సమయంలో నేను ఇంత కష్టపడ్డాడు.

ప్రస్తుతం ఇన్ని కేసులు విచారణలో ఉన్నాయని నియోజకవర్గ ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.దీనిపై చర్చ ఎందుకు వచ్చిందంటే ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థులు తమపై నమోదైన కేసులకు, విచారణలో ఉన్న కేసులకు ఎక్కడా పొంత కుదరడం లేదని చెప్పాలి.

ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు.ప్రస్తుతం ఈ కేసుల రాజకీయం అంతా ఓట్లకోసమేనని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై తనపై ఉద్యమ సమయంలో మొత్తం 19 కేసులు నమోదయ్యాయని, అందులో 5 విచారణలో ఉన్నాయన్నారు.ఇకపోతే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తనపై 130కు పైగా కేసులు నమోదయ్యాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూలో పోరాటం చేస్తున్నపుడు తనపై ఇన్ని కేసులు పెట్టారన్నారు.కానీ, అందులో 3 కేసులు మాత్రమే విచారణలో ఉన్నాయని చెప్పడం అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశం.

ఇక కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ బల్మూరి తనపై మొత్తం 24 కేసులు నమోదవ్వగా అందులో 8 కేసులు విచారణలో ఉన్నాయని పేర్కొన్నారు.కానీ, ఇవన్నీ తెలంగాణ వచ్చాక ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో పెట్టిన కేసులని వివరించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం తాము ఎంత కష్టపడ్డామో హుజురాబాద్ ఎన్నికల పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం చేసుకోవడం ఓట్ల కోసమేనని అందరూ భావిస్తున్నారు.రాష్ట్రం సిద్ధించి ఏడేండ్లు గడుస్తున్నా ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ రెండు అధికారంలోకి వచ్చాక కూడా మళ్లీ ఉద్యమం పేరు, కేసుల పేర్లు చెప్పుకుని ఓట్లు అడుక్కోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

అదే బాటలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా నడవడం ఈ ఎన్నికల్లో ఓటర్లను మళ్లీ నాయకులు మభ్యపెడుతున్నారని అని స్పష్టం అవుతోంది.ఈటల కంటే గెల్లు తనపై ఎక్కువగా కేసులు నమోదయ్యాయని చెప్పడం వెనుక ఆంతర్యం ఎంటంటే.

ఈటల కంటే తానే ఎక్కువగా ఉద్యమంలో పాల్గొన్నానని ఓటర్లను మభ్య పెట్టేందుకే ప్రచారంలో కేసుల విషయం మాట్లాడుతున్నారని అంతా భావిస్తున్నారు.వీరిని చూసి కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ కూడా అదే బాటలో నడువడం ఓటర్లను ప్రభావితం చేసేందుకే అని అర్థమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube