కాంగ్రెస్‌కు క్యాండిడేట్ క‌ష్టాలు.. ఇప్ప‌ట్లో ప్ర‌క‌టించేది క‌ష్టమే..

ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్ గాఉన్న హుజూరాబాద్‌ను అన్ని పార్టీలు సీరియ‌స్‌గా తీస‌కుంటే కాంగ్రెస్ మాత్రం చాలా లైట్ తీసుకుంటున్న‌ట్టు అనిపిస్తోంది.ఎందుకంటే ఇప్ప‌టికే టీఆర్ ఎస్‌, బీజేపీ పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసి ప్ర‌చారంలో దూసుకుపోతున్నాయి.

 Candidate Difficulties For Congress .. It Is Difficult To Announce Now . Congre-TeluguStop.com

అనుకున్న‌ట్టు గానే త‌మ ప్ర‌చారాల‌తో హోరెత్తిస్తున్నారు ఇరు పార్టీలు కూడా.కాగా ఇంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పెద్ద‌గా ఫోక‌స్ పెట్ట‌న‌ట్టు క‌నిపిస్తోంది.

పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడ‌టంతో అంతా అయోమ‌యంలో ప‌డ్డారు.

ఇక కౌశిక్ వెన‌కాలే చాలా వ‌ర‌కు కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ ను వీడ‌టంతో కాంగ్రెస్‌కు అబ్య‌ర్థి క‌రువ‌య్యారు.

ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల బాధ్యతలను కాంగ్రెస్ త‌ర‌ఫున దామోదర నర్సింహ చూస్తున్నారు.కాగా బ‌ల‌మైన అభ్య‌ర్థులు ఎవ‌రూ కూడా బరిలోకి దిగడానికి ఎవరూ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు మొద‌ల‌య్యాయి.

ఇక రీసెంట్ గా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు బ‌లంగా వినిపించినా కూడా ఆమె చాలా ర‌కాల షరతులను ముందు పెడుతోంది.దీంతో ఆమె ష‌ర‌తుల‌కు చాలామంది సీనియర్ నేత‌లు అడ్డుప‌డుతున్నారంట‌
.

Telugu Congress, Huzurabad, Revanth Reddy, Trs, Ts Congress, Ts Poltics-Telugu P

ఇక ఇవ‌న్నీ కాద‌ని హుజూరాబాద్ లో ఎవ‌రు పోటీ చేయాల‌నుకున్నా స‌రే గాంధీ భ‌వ‌న్‌లో దరఖాస్తులు స‌మ‌ర్పించాల‌ని కోరారు.అయితే ఈ ద‌ర‌ఖాస్తుల వ్య‌వ‌హారం కొత్త స‌మ‌స్య‌లు తెచ్చిపెడుతోంది.19వ‌ర‌కు అప్లికేష‌న్లు వ‌చ్చినా కూడా అందులో పెద్ద నేత‌లు ఎవ‌రూ లేరు.దీంతో వారిని ఫైన‌ల్ చేయ‌కుండా ఇంకా బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను ఎంపిక వారితో ద‌ర‌ఖాస్తు చేయించాల‌ని ఇందుకోసం గ‌డువు తేదీని కూడా పొడిగిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఎన్నిక‌లు కూడా వాయిదా ప‌డుతుండ‌టంతో చాలా టైమ్ దొరికింది.దీంతో ఇప్ప‌ట్లో అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేందుకు కూడా కాంగ్రెస్ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ట్లేదు.ఎన్నిక‌ల త‌రుణం వ‌చ్చే వ‌ర‌కు ఎవ‌రినో ఒక‌రిని ఫైన‌ల్ చేద్దామ‌న్న‌ట్టు చూస్తోంది.దీంతో ద‌ర‌కాస్తు చేసుకున్న‌వారు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube