పదో తరగతి పరీక్షలు పూర్తిగా రద్దుచేయాలంటున్న మంచు విష్ణు  

Cancel 10th Class Exam Says Actor Manchu Vishnu - Telugu Academic Exams,, Corona Effect, South Heroes, Ssc Exams, Tollywood

కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది.ఏ మాత్రం అవకాశం దొరికిన కరోనా తన ప్రభావం చూపించడానికి రెడీ అవుతుంది.

 Cancel 10th Class Exam Says Actor Manchu Vishnu

ఓ వైపు కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండటంతో కరోనాని కొంతైనా నియంత్రించే ఉద్దేశ్యంతో మధ్యలో వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలు ప్రభుత్వాలు రద్దు చేశాయి.చాలా రాష్ట్రాలు ఈ దారిలో వెళ్ళాయి.

అలాగే డిగ్రీ, వృత్తి విద్యా పరీక్షలు ఈ ఏడాదికి రద్దు చేశాయి.ఇక ఆగష్టులో స్కూల్స్, కాలేజీలు ఓపెన్ చేయాలని అనుకుంటున్నారు.

పదో తరగతి పరీక్షలు పూర్తిగా రద్దుచేయాలంటున్న మంచు విష్ణు-General-Telugu-Telugu Tollywood Photo Image

కానీ అది ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది మాత్రం తెలియదు.ఇదిలా ఉంటే పదో తరగతి పరీక్షలు మొత్తం రద్దు చేసి ఏకంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రమే ఉంచాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తుంది.

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం వలన పెద్దగా ప్రయోజనం లేదని విద్యా వ్యవస్థలో మార్పులు చేసి స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ వరకు కొనసాగించాలని మేధావులు కోరుతున్నారు.అలా అయితే విద్యార్ధులు తమని తాము తయారు చేసుకొని ఒత్తిడిని అధిగమించే అవకాశం దొరుకుతుందని చెబుతున్నారు.ఇప్పుడు ఇదే విషయంపై మంచు విష్ణు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.14, 15 సంవత్సరాల పిల్లలపై ఈ బోర్డు ఎగ్జామ్స్ ఒత్తిడి ఏంటని ప్రశ్నించారు.బోర్డు ఎగ్జామ్స్ తో ఏం ప్రయోజనం అని ట్వీట్ చేశారు.పదో తరగతి కోసం నిర్వహించే పబ్లిక్ పరీక్షలను ఈసారికి మాత్రమే కాదు, అసలు పూర్తిగా ఎత్తేయాలని బలంగా భావిస్తున్నాను.

పదో తరగతికి బోర్డు ఎగ్జామ్స్ అనేవే ఉండకూడదు అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ప్రస్తుతం అతను సొంతంగా ఒక స్కూల్ కూడా నడుపుతున్నారు.ఈ నేపధ్యంలో విద్యావిధానంలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Cancel 10th Class Exam Says Actor Manchu Vishnu Related Telugu News,Photos/Pics,Images..

footer-test