ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాద నేత, ఖలిస్తాన్ టైగర్స్ ఫోర్స్ అధినేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రమేయం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మంటలు రేపుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా.
కెనడాలో వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ మూసివేసింది.ఇదిలావుండగా.
నిజ్జర్ హత్య వెనుక ఇండియా వుందంటూ కెనడాలోని సిక్కు సంస్థలు గత కొంతకాలంగా వాదిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ట్రూడో వ్యాఖ్యలు వారికి మరింత బలాన్ని ఇచ్చినట్లయ్యింది.

ఈ క్రమంలో కెనడాలోని సిక్కులు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు.దేశంలోని భారత దౌత్య కార్యాలయాల( Indian Embassies ) వెలుప నిరసనలు చేపట్టారు.టొరంటోలో( Toronto ) దాదాపు 100 మంది ఆందోళనకారులు భారత జాతీయ జెండాను దహనం చేశారు.వాంకోవర్‌లోని కాన్సులేట్ కార్యాలయం వద్ద కూడా భారీ స్థాయిలో సిక్కులు ఆందోళన నిర్వహించారు.
ఒట్టావాలోని.భారత హైకమీషన్ కార్యాలయం వద్ద గుమిగూడిన ఆందోళనకారులు ఖలిస్తాన్ జెండాలు ప్రదర్శిస్తూ, భారత వ్యతిరేక నినాదాలు చేశారు.
రేష్మా సింగ్ బోలినాస్( Reshma Singh Bolinas ) అనే నిరసనకారుడు మాట్లాడుతూ.తాము జస్టిన్ ట్రూడోకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ పరికిపింద చర్య సంగతి తేల్చేందుకు తాము ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టేది లేదన్నారు.అమాయకుల హత్యలను ఆపడానికి భారతదేశంపై కెనడా ఒత్తిడి తీసుకురావాలని రేష్మా సింగ్ కోరారు.

ఇదిలావుండగా నిజ్జర్ హత్య విషయంగా అమెరికా స్వరం మారుతున్నట్లుగా కనిపిస్తోంది.కెనడాకు మద్ధతుగా అగ్రరాజ్యం మాట్లాడటం మొదలెట్టింది.నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో సహకరించాలని భారత్‌ను కోరినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ( Matthew Miller )తెలిపారు.ఈ ఘటనలో దోషులకు శిక్షపడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కాలిఫోర్నియా ప్రతినిధుల సభ సభ్యుడు జిమ్ కోస్టా మాట్లాడుతూ.నిజ్జర్ హత్యపై తాను చాలా ఆందోళన చెందానని తెలిపారు.
ఈ నేరానికి సంబంధించి దోషులను గుర్తించాలన్నారు.