తమను భర్తలు వేధిస్తున్నారనే వార్తలు ఎప్పుడూ వినిపించేవే.అయితే భార్యల చేతిలో తన్నులు, వేధింపులు ఎదుర్కొనే భర్తలు సైతం వున్నారు.
సమస్య ఎప్పుడూ సమస్యే.దానికి లింగభేదాలు అన్వయించకూడదు.
భర్తల వల్ల ఇబ్బందులు పడుతున్న భార్యలు అని మీడియా వెలుగులోకి తెస్తోంది తప్పించి.భార్యల వల్ల భర్తలు పడే అగచాట్లను వెలుగులోకి తేవడం లేదని కొందరు అంటున్నారు.
తమకు కూడా సామాజిక న్యాయం జరగాలని భార్యా బాధితులు కోరుతున్నారు.
అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగు చూసింది.
భార్యను గొప్ప స్థితిలో వుంచాలని ఓ భర్త చేసిన త్యాగం బూడిదలో పోసిన పన్నీరైంది.తీరా విదేశాలకి వెళ్లిన తర్వాత తన అసలు రూపం చూపించింది.
భర్తను దేశం కానీ దేశంలోనే విడిచిపెట్టి వెళ్లిపోయింది.వివరాల్లోకి వెళితే.
పంజాబ్ రాష్ట్రం మోగా జిల్లాలోని ఖొసా కొట్లాకి చెందిన రజ్వీందర్ కౌర్ తూర్‌కు రౌలి గ్రామానికి చెందిన హర్దీప్ సింగ్‌తో వివాహమైంది.పెళ్లి తర్వాత భార్యను పై చదువుల కోసం కెనడాకు పంపించాడు హర్దీప్.ఇందుకు కోసం ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా రూ.18.50 లక్షలు వెచ్చించాడు.తాను కెనడాలో స్థిరపడిన తర్వాత అక్కడికి తీసుకెళ్తానని భర్తకు మాట ఇచ్చిన రజ్వీందర్.
అన్న మాట ప్రకారం కొన్నాళ్ల తర్వాత హర్దీప్‌కు ఫోన్ చేసి పిలిచింది.దీంతో పట్టరాని సంతోషంతో కెనడాలో అడుగుపెట్టిన హర్దీప్.
భార్య రాక కోసం ఎయిర్‌పోర్ట్‌లోనే ఎదురుచూస్తున్నాడు.భర్తను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన రజ్వీందర్… తన నిజ స్వరూపం బయటపెట్టింది.తనకు మరో రూ.8 లక్షలు ఇవ్వాలని.లేని పక్షంలో ఇంటికి తీసుకెళ్లేది లేదని కుండబద్ధలు కొట్టింది.

ఊహించని పరిణామంతో షాక్‌కు గురైన హర్దీప్ … వెంటనే తేరుకున్నాడు.ప్రస్తుతం తన వద్ద అంత డబ్బు లేదని .తర్వాత చూసుకుందామని చెప్పినా వినిపించుకోలేదు.ఏమాత్రం కనికరం లేకుండా దేశం కానీ దేశంలో ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసి వెళ్లిపోయింది.
నానా తంటాలు పడి తిరిగి భారతదేశానికి వచ్చేసిన హర్దీప్.రజ్వీందర్ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రజ్వీందర్ ఆమె తండ్రి గురుప్రీత్ సింగ్, తల్లి హర్ ప్రకాశ్ కౌర్‌లపై పలు అభియోగాల కింద కేసు నమోదు చేశారు.
కాగా.
ఎన్ఆర్ఐ వధువులు భర్తలను వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలపై చర్చ జరగాలని పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ కొద్దిరోజుల క్రితం లోక్‌సభలో నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.అనేక మంది భర్తలు.
తమ భార్యలకు ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్‌టీఎస్)ను అభ్యసించేందుకు .ఆ తర్వాత విదేశాలకు వెళ్లి స్థిరపడేందుకు ఆర్దిక సాయం చేస్తున్నారని గిల్ తెలిపారు.చదువు పూర్తయిన తర్వాత భార్య వర్క్ పర్మిట్ తీసుకుంటుందని.విదేశంలో భర్తను స్పాన్సర్ చేయడానికి బదులుగా వదిలిపెట్టేస్తున్నారని జస్బీర్ ఆరోపించారు.







