ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలోని సిక్కు గ్రూపులు, ఖలిస్తాన్ సంస్థల చేతికి ఆయుధాన్ని ఇచ్చినట్లు అయ్యింది.అసలే టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ ఉగ్రమూకలు సాక్షాత్తూ కెనడా ప్రధాని వ్యాఖ్యలతో భారత్‌పై మరింత విషం చిమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఆ గ్రూపులు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.వీటిలో సిక్స్ ఫర్ జస్టిస్ ‘ఎస్ఎఫ్‌జే’ ముందుంది.
ఇప్పటికే వరుస రెఫరెండాలతో ఈ సంస్థ కెనడాలో హల్‌చల్ చేస్తోంది.
హిందువులంతా తక్షణం కెనడాను( Canada ) వదిలిపెట్టాల్సిందిగా ఎస్ఎఫ్‌జే ఇప్పటికే హెచ్చరించింది.
నిజ్జర్ హత్యకు గాను భారతదేశానికి మద్ధతుగా హింసను ప్రోత్సహించినందుకు కెనడాను విడిచిపెట్టాల్సిందిగా అల్టీమేటం జారీ చేసింది.ఇక్కడున్న హిందువులు( Hindus ) భారతదేశానికి మద్ధతు ఇవ్వడమే కాకుండా.
ఖలిస్తాన్ మద్ధతుదారుల ప్రసంగాలు, వ్యక్తీకరణను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్ఎఫ్‌జే ఆరోపించింది.ఈ మేరకు ఆ సంస్థ కీలక నేత, న్యాయవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ( Gurpatwant Pannun ) ఓ వీడియోను విడుదల చేశారు.

ఎస్ఎఫ్‌జే ప్రకటనపై కెనడియన్ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.పన్నూ వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు.కెనడా పబ్లిక్ సేఫ్టీ మంత్రి డొమినిక్ లెబ్లాంక్( Canada Minister Dominic LeBlanc ) మాట్లాడుతూ.కెనడియన్లందరూ తమ కమ్యూనిటీలలో సురక్షితంగా వుండేందుకు అర్హులన్నారు.హిందూ కెనడియన్లను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో ద్వేషపూరిత వీడియో.మనం గౌరవించే విలువలకు విరుద్ధంగా వుందని లెబ్లాంక్ వ్యాఖ్యానించారు.
ద్వేషం, బెదిరింపు, భయాన్ని ప్రేరేపించే చర్యలకు కెనడాలో చోటు లేదని ఆయన ట్వీట్ చేశారు.అత్యవసర సంసిద్ధత మంత్రి హర్జిత్ సజ్జన్( Minister Harjit Sajjan ) కూడా ఎస్ఎఫ్‌జే తీరును ఖండించారు.
హిందూ కెనడియన్లు సహా అన్ని నేపథ్యాల నుంచి వచ్చిన భారతీయులు ఇక్కడ సురక్షితంగా వుండటానికి అర్హులన్నారు.

ఇప్పటికే కెనడాలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం, ఆలయ గోడలపై భారత వ్యతిరేక పోస్టర్‌లను అతికించడం వంటి చర్యలకు పాల్పడుతూ ఖలిస్తాన్ మద్ధతుదారులు అలజడి రేపుతున్నారు.హిందూ వ్యతిరేక పక్షపాతం, వివక్షను నివారించడానికి మానవ హక్కుల కోడ్‌లోని పదాల పదకోశంలో హిందూ ఫోబియాను గుర్తించాలని కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ ముందు ఓ పిటిషన్ పెండింగ్‌లో వుంది.ఈ పిటిషన్‌పై ఇప్పటి వరకు దాదాపు 9000 మంది సంతకాలు చేశారు.