సోమాలియాలో ఉగ్రదాడి కెనడా సంతతి జర్నలిస్ట్ మృతి

సోమాలియాలో ఉగ్రవాదుల దాడిలో సోమాలి-కెనడా పౌరురాలు జర్నలిస్ట్ అయిన నలాయేహ్ సహా 10 మంది దుర్మరణం పాలయ్యారు.కిస్‌మయో నగరంలోని అససే హోటల్‌ ప్రధాన ద్వారం వద్ద ఉగ్రవాదులు శక్తివంతమైన కారు బాంబును పేల్చారు.

నిషేధిత ఉగ్రవాద సంస్ధ అల్ షాబాబ్ ఈ దాడిని తామే చేసినట్లుగా ప్రకటించింది.

సోమాలియాలో ఉగ్రదాడి కెనడా సం�

సోమాలియాలో త్వరలో ఎన్నికలు జరగనుండటంతో వివిధ పార్టీల నేతలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆ హోటల్‌లో సమావేశమయ్యారు.వారిని లక్ష్యంగా చేసుకుని అల్ షాబాబ్ దాడికి తెగబడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

సోమాలియాలో ఉగ్రదాడి కెనడా సం�

సోమాలియ పునర్నిర్మాణంతో పాటు మానవ హక్కులు, మహిళ భద్రత కోసం ఆమె విశేషంగా కృషి చేశారు.ప్రధానంగా కెనడా-సోమాలియాల మధ్య సంబంధాలు పటిష్ట పరిచేందుకు నలాయేహ్ శ్రమించారు.కొద్దిరోజుల క్రితం మీనింగ్ ఫుల్ వర్క్ – మీనింగ్‌పుల్ లైఫ్ పేరిట ఒక చర్చా వేదికను ప్రారంభించిన ఆమె ఉగ్రవాదుల మారణహోమంలో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న సోమాలీల దయనీయ స్థితిని కళ్లకు గట్టారు.

ఆమె మరణం పట్ల పలువురు నేతలు, జర్నలిస్టులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.12 మంది సంతానంలో పెద్దవారైన నలాయేహ్ తన 11 మంది సోదరి, సోదరుల కోసం చిన్న వయసులోనే కుటుంబ పోషణను తలకెత్తుకున్నారు.సోమాలియా పునర్నిర్మాణానికి ఎవరు ముందుకొచ్చినా వారు బలవ్వక తప్పదని.2106లో జరిగిన ఐక్యరాజ్యసమితి వర్క్‌‌ షాప్‌లో నలాయేహ్ పేర్కొన్నారు.ఆమె చెప్పినట్లుగానే ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube