కెనడా: నెలాఖరు వరకు ఆంక్షలు.. ప్రత్యేక విమానాలు నడపాలంటూ ఎన్ఆర్ఐల విజ్ఞప్తి  

Canadian govt seals borders; stranded Punjabi NRI, students appeals govt to start special flights,Canadian govt ,lockdown effect - Telugu Canadian Govt, Canadian Govt Seals Borders; Stranded Punjabi Nri, Lockdown Effect, Students Appeals Govt To Start Special Flights

కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో కెనడా ప్రభుత్వం ఆంక్షలను మరికొంతకాలం పొడిగించింది.సరిహద్దులను మూసివేయడంతో పాటు జూలై వరకు ప్రయాణాలపై పరిమితులు ఉంటాయని వెల్లడించింది.

 Canadian Govt Students Special Flights

ఈ క్రమంలో కెనడా, భారత్‌లలో చిక్కుకుపోయిన భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తమను స్వదేశానికి పంపించాలంటూ ఇరు దేశాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు.

పంజాబ్‌లోని జలంధర్‌ సమీపంలోని కలాన్ గ్రామానికి చెందిన జోగా సింగ్ మాట్లాడుతూ.ఆగస్టులో తన ఏకైక కుమారుడు మన్‌దీప్ సింగ్ వివాహానికి హాజరుకావడానికి తన భార్యతో కలిసి జూలై 27న కెనడాకి వెళ్లాల్సి వుందన్నారు.

కెనడా: నెలాఖరు వరకు ఆంక్షలు.. ప్రత్యేక విమానాలు నడపాలంటూ ఎన్ఆర్ఐల విజ్ఞప్తి-Telugu NRI-Telugu Tollywood Photo Image

అయితే లాక్‌డౌన్‌ కారణంగా తాము టికెట్ పొందలేకపోయామని, దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో వివాహాన్ని వాయిదా వేయాల్సి ఉంటుందేమోనని జోగా సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరో ఎన్ఆర్ఐ అమన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.

ఓ కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఫిబ్రవరిలో దోబా ప్రాంతంలోని తన స్వగ్రామానికి వచ్చానని చెప్పారు.మార్చి 29న తాను తిరిగి కెనడాకి వెళ్లాల్సి వుందని, అయితే లాక్‌డౌన్ కారణంగా తాను పంజాబ్‌లోనే చిక్కుకుపోయానని వాపోయారు.

తన కోసం అక్కడి కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారని.ఇరు ప్రభుత్వాలు తక్షణం స్పందించాలని అమన్‌ప్రీత్ కౌర్ కోరారు.

కాగా ఇటీవల కెనడాకు చెందిన ఓ పౌరుడు విమాన టికెట్ దొరక్క, మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం కలిగించింది.

మరోవైపు పంజాబ్ నుంచి ప్రతి సంవత్సరం లక్షకు పైగా విద్యార్థులు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్తారు.ముఖ్యంగా కెనడాకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.ఈ ఏడాది కూడా అక్కడికి వెళ్లడానికి వేల సంఖ్యలో విద్యార్ధులు వేచి వున్నారు.

అయితే ఆ దేశ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు.

ఫగ్వారాకు చెందిన సిమ్రాన్‌జిత్ కౌర్ మాట్లాడుతూ.

ఈ ప్రాంతానికి చెందిన దాదాపు 50 మంది విద్యార్ధులు తమ కుటుంబాలను కలవడానికి భారతదేశానికి వెళ్లారు.అయితే ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా వీరంతా ఇక్కడే చిక్కుకుపోగా.

తాజాగా కెనడా ప్రభుత్వ నిర్ణయం వీరిలో నిరాశను నింపింది.ఈ ఆంక్షలపై కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ… భూమి, సముద్రం, వాయు, రైలు ఇలా అన్ని రవాణా మార్గాల్లో ప్రయాణ పరిమితులు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

#Lockdown Effect #Canadian Govt

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Canadian Govt Students Special Flights Related Telugu News,Photos/Pics,Images..