సిక్కు మోటార్ సైకిలిస్టులకు శుభవార్త .. హెల్మెట్ విషయంలో మినహాయింపునిచ్చిన కెనడా ప్రావిన్స్

సిక్కులు( Sikhs ) తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.

 Canada Saskatchewan Province Allows Sikh Motorcyclists To Ride Without Helmets F-TeluguStop.com

తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు.

విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.

అయితే ఈ కట్టుబాట్లే ఒక్కొక్కసారి వీరిని సమస్యలకు గురిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే పలు దేశాల్లో తమకు ప్రత్యేక గుర్తింపు కేటాయించాలని సిక్కులు ఆందోళనలు చేస్తున్నారు.

Telugu Canada, Canada Sikhs, Legendarysikh, Don Morgan, Helmets, Sikh-Telugu NRI

ఇదిలావుండగా.సిక్కులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన కెనడాలో( Canada ) వారికి ఊరట కలిగే ప్రకటన వెలువడింది.అక్కడి సస్కట్చేవాన్ ప్రావిన్స్‌( Saskatchewan Province ) ప్రభుత్వం సిక్కు మోటార్ సైకిలిస్టులకు( Sikh Motorcyclists ) ఛారిటీ రైడ్‌ల వంటి ప్రత్యేక కార్యక్రమాల సమయంలో హెల్మెట్ ధరించకుండా తాత్కాలిక మినహాయింపునిచ్చింది.బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌కు చెందిన లెజెండరీ సిక్కు రైడర్స్ అనే మోటార్ సైకిల్ గ్రూప్.

ధార్మిక కార్యక్రమాల కోసం డబ్బును సేకరించడానికి కెనడా అంతటా ప్రయాణించనుంది.ఈ క్రమంలోనే ఈ గ్రూప్ అభ్యర్ధన మేరకు సస్కట్చేవాన్ ప్రావిన్స్ హెల్మెట్ విషయంలో మినహాయింపునిచ్చింది.

Telugu Canada, Canada Sikhs, Legendarysikh, Don Morgan, Helmets, Sikh-Telugu NRI

బ్రిటీష్ కొలంబియా, అల్బెర్టా, మానిటోబో, అంటారియా, సస్కట్చేవాన్ ప్రావిన్సులలో మతపరమతైన కారణాల కోసం శాశ్వతమైన బ్లాంకెట్ హెల్మెట్ మినహాయింపులు వున్నప్పటికీ.పబ్లిక్ రోడ్లపై మోటార్ సైకిల్‌ను నడుపుతున్నప్పుడు మోటార్ సైకిలిస్టులంతా హెల్మెట్ ధరించాల్సిందేనని చట్టం చెబుతోంది.అయితే సిక్కు మతానికి చెందిన వారందరికీ హెల్మెట్ లేకుండా మోటార్ సైకిళ్లు నడపటానికి అనుమతి లేదని సస్కట్చేవాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.వాహన సామాగ్రి నిబంధనలకు సవరణలు తాత్కాలికంగా వుంటాయని సస్కట్చేవాన్ మంత్రి డాన్ మోర్గాన్ తెలిపారు.

ఈ తాత్కాలిక మినహాయింపు వల్ల భవిష్యత్తులో స్వచ్ఛంద సంస్థల నిధుల సేకరణకు సహాయం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube