రండి బాబూ రండి అంటోన్న కెనడా.. 9 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ, సెటిల్ అవ్వాలనుకుంటే భలే ఛాన్స్..!!

కరోనా వైరస్ సృష్టించిన కల్లోల పరిస్ధితుల ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పట్లో కోలుకునే దారి కనిపించడం లేదు.లక్షలాది మంది ప్రాణాలు తీయడంతో పాటు ఆర్ధిక వ్యవస్థను నష్టాల ఊబిలో ముంచింది ఈ మహమ్మారి.

 Canadas Job Vacancies Hit Record High In 2021 , Justin Trudeau, Corona Virus, He-TeluguStop.com

కోట్లాది మంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడటంతో.లెక్కకు మిక్కిలి కుటుంబాలు ఆకలి కేకలతో అల్లాడుతున్నాయి.అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే.ఉద్యోగాలు పోయి జనం ఏడుస్తుంటే.ఇంకోవైపు ఉద్యోగాల కొరతతో కొన్ని దేశాలు అల్లాడుతున్నాయి.ఇందులో కెనడాది మొదటిస్థానంగా చెప్పుకోవచ్చు.

ఆ దేశ అధికారిక గణాంకాల ప్ర‌కారం.ఈ ఏడాది మూడ‌వ త్రైమాసికంలో 9,12,600 ఉద్యోగాలు ఖాళీగా వున్నాయట.క‌రోనా కారణంగానే కెనడాలో ఈ పరిస్ధితి ఎదురైనట్లుగా తెలుస్తోంది.2019 ప్రారంభంలో అన్ని రంగాల‌తో క‌లిపి దేశంలో సుమారు 3,49,700 ఉద్యోగాలు ఖాళీలు వుండగా… ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపయ్యింది.2019 మూడ‌వ త్రైమాసికం నుంచి 2021 మూడ‌వ క్వార్ట‌ర్ మ‌ధ్య‌లో 18 రంగాల్లో ఖాళీలు పెరిగిన‌ట్లు గణాంకాలు చెబుతున్నాయి.అయితే అగ్రిక‌ల్చ‌ర్‌, ఫారెస్ట్రి, ఫిషింగ్‌, హంటింగ్‌, రియ‌ల్ ఎస్టేట్ రంగాల్లో ఖాళీలు ఏర్ప‌డ‌లేదు.

హెల్త్ కేర్‌, క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌, అకామిడేష‌న్ అండ్ ఫుడ్‌, రిటేల్ ట్రేడ్‌, మాన్యుఫ్యాక్చ‌రింగ్ రంగాల్లో మాత్రం ఖాళీలు పెరుగుతున్నాయి.త‌క్కువ జీతాలు ఉండే రంగాల్లో మాత్ర‌మే భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధి కోసం కెన‌డా ప్రభుత్వం భారీ స్థాయిలో ఇమ్మిగ్రేష‌న్ విధానాలను సడలించే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి.కెనడీయన్లలో సంతానోత్ప‌త్తి రేటు త‌గ్గ‌డం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జస్టిన్ ట్రూడో రాబోయే సంవత్సరం 4,11,000 మందికి శాశ్వత పౌరసత్వం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.కెనడియన్ తయారీ, ఎగుమతిదారుల సంఘం 2030 నాటికి పరిస్ధితులు మరింత క్లిష్టంగా మారుతాయన్న నేపథ్యంలో వలసదారులకు తలుపులు తెరవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube