పరిశీలనలోనే దరఖాస్తు.. ఆరు నెలలు గడుస్తున్నా కెనడాలో ‘‘కోవాగ్జిన్’’కు దక్కని ఆమోదముద్ర

Canada Yet To Approve Covaxin For Emergency Use

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘‘కోవాగ్జిన్’’కు హెల్త్ కెనడా నుంచి అత్యవసర వినియోగ ఆమోదం ఇంకా అనుమతి లభించలేదు.ఇందుకోసం డేటాను సమర్పించి ఆరు నెలలు గడిచినప్పటికీ.

 Canada Yet To Approve Covaxin For Emergency Use-TeluguStop.com

దీనిపై సమీక్ష ఇంకా కొనసాగుతోంది.ఈ విషయంలో నిర్ణయం ఎప్పుడు తీసుకోబడుతుందో అంచనా వేయలేమని ఆ ఏజెన్సీ తెలిపింది.

కోవాగ్జిన్ అత్యవసర అనుమతి కోసం భారత్ బయోటెక్ భాగస్వామి.అమెరికన్ కంపెనీ ఓక్యుజెన్ కెనడియన్ అనుబంధ సంస్థ అయిన వ్యాక్సిజెన్ ద్వారా గతేడాది జూన్ 30న దరఖాస్తు సమర్పించింది.

 Canada Yet To Approve Covaxin For Emergency Use-పరిశీలనలోనే దరఖాస్తు.. ఆరు నెలలు గడుస్తున్నా కెనడాలో ‘‘కోవాగ్జిన్’’కు దక్కని ఆమోదముద్ర-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనిపై హెల్త్ కెనడా గురువారం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.అవసరమైన మొత్తం సమాచారాన్ని క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.సమీక్ష ఇంకా కొనసాగుతున్నందున.రెగ్యులేటరీ తన నిర్ణయం ఎప్పుడు తీసుకోబడుతుందో అంచనా వేయడం సాధ్యం కాదని వెల్లడించింది.

శాస్త్రీయ దృఢత్వం.మెడికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఉత్పత్తులకు అధికారం ఇస్తుందని చెప్పారు.

హెల్త్ కెనడా సమీక్షను పూర్తి చేసేందుకు అదనపు డేటా అవసరం.స్పాన్సర్‌తో చర్చలు, భద్రతా సమాచారానికి సంబంధించిన అప్‌డేట్‌ల కోసం ఆవశ్యకత వంటి అనేక అంశాలపై ఆధారపడి వుంటుంది.

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్‌ టీకా ‘కోవాగ్జిన్‌’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే.కోవాగ్జిన్‌ను ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌(ఈయూఎల్‌)లో చేర్చినట్లు డబ్ల్యూహెచ్‌ఓ నవంబర్ 4న ప్రకటించింది.

కోవాగ్జిన్‌కు ఈయూఎల్‌ హోదా కల్పించవచ్చంటూ డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన స్వతంత్ర సాంకేతిక సలహా బృందం(టీఏజీ) ప్రతిపాదించడంతో టీకాకు మార్గం సుగమమైంది.

Telugu America, Americancompany, Australia, Biotechcompany, Britain, Canada, Canadaapprove, Emergency, Kovaggin-Telugu NRI

గతంలో కోవాగ్జిన్‌ అంతర్జాతీయంగా అనుమతి పొందిన వ్యాక్సిన్ల జాబితాలో లేకపోవడంతో విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇబ్బంది ఏర్పడింది.ఈ నేపథ్యంలో కోవాగ్జిన్ అనుమతి విషయంలో ఇండియా.ప్రపంచ ఆరోగ్యసంస్థపై ఒత్తిడి తెచ్చింది.

ఈ ప్రయత్నాలు ఫలించి కోవాగ్జిన్‌ ఈయూఎల్‌లో చోటు దక్కించుకుంది.దీని వల్ల కోవాగ్జిన్ వేయించుకున్న వారు వివిధ దేశాలకు వెళ్లినప్పుడు ఎలాంటి క్వారంటైన్‌లో వుండనక్కర్లేదు.

డబ్ల్యూహెచ్‌ఓ నుంచి ప్రకటన వెలువడిన తక్షణం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కోవాగ్జిన్ వేయించుకున్న వారిని తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

#Canada #America #CanadaApprove #Britain #Australia

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube