సిక్కుల పర్వదినం వైశాఖీని( Vaisakhi ) ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.పంట ఇంటికి వచ్చే రోజుగా దీనిని హిందువులు, సిక్కులు జరుపుకుంటారు.
సూర్యమాన పంచాంగం ప్రకారం ఇది ఏడాదిలో తొలి పండుగ.సిక్కు గురువులలో ఒకరైన గురు గోబింద్ సింగ్( Guru Gobind Singh ) ఇదే రోజున ఖల్సాను స్థాపించారు.
అందువల్ల ఈ రోజును సిక్కులు ( Sikhs ) అత్యంత పవిత్రంగా భావిస్తారు.ఇక కెనడాలో దాదాపు మూడేళ్ల తర్వాత వైశాఖీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా కెనడా ప్రభుత్వం దేశంలో కఠినమైన ఆంక్షలను విధించింది.అయితే ప్రస్తుతం కోవిడ్ శాంతించడంతో ఆంక్షలను ఎత్తివేసింది.
ఈ నేపథ్యంలో మూడేళ్ల తర్వాత శనివారం వాంకోవర్( Vancouver ) విధుల్లో సిక్కులు నగర్ కీర్తన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లక్షల మంది పాల్గొని.
కవాతుకు స్వాగతం పలికారు.

ఖల్సా డే పరేడ్‌గా పిలిచే ఈ కార్యక్రమాన్ని 1906లో స్థాపించిన ఖల్సా దివాన్ సొసైటీ ప్రతి యేటా నిర్వహిస్తుంది.బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని వాంకోవర్‌లో చారిత్రాత్మక రాస్ స్ట్రీట్ గురుద్వారా కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటుంది.2019 తర్వాత తొలిసారిగా నగర్ కీర్తన కార్యక్రమం జరగడంతో స్థానిక పంజాబీ సంతతి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.భారతదేశానికి వెలుపల జరుగుతున్న అత్యంత పురాతనమైన నగర్ కీర్తన ఇదేనని సొసైటీ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ సంఘేరా తెలిపారు.స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11 గంటలకు రాస్ స్ట్రీట్ గురుద్వారా నుంచి ప్రారంభమైన కవాతు సాయంత్రం 4.30 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంది.

ఇకపోతే.కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం గురుద్వారాను సందర్శించి సిక్కులకు వైశాఖీ శుభాకాంక్షలు తెలిపారు.ఆయన వెంట కేబినెట్ మంత్రి హర్జిత్ సజ్జన్ కూడా వున్నారు.
ఆ తర్వాత జరిగిన నగర్ కీర్తన్‌లో వాంకోవర్ మేయర్ కెన్ సిమ్ కూడా పాల్గొన్నారు.కోవిడ్ కారణంగా 2020 , 2021లో నగర్ కీర్తన్‌లను గురుద్వారా కమిటీ రద్దు చేసింది.
ఆ సమయంలో వీటిని కేవలం గురుద్వారాకే పరిమితం చేశారు.