ఆ తరహా తుపాకులపై కెనడా సర్కార్ కన్నెర్ర.. నిషేధం దిశగా

ప్రపంచవ్యాప్తంగా ఉన్మాదుల తుపాకీ కాల్పుల్లో ఏటా వేలాది మంది మరణిస్తున్న సంగతి తెలిసిందే.వీటిలో బయటి ప్రపంచానికి తెలిసింది కొన్నే.

 Canada Trudeau Govt Proposes Ban On Assault-style Firearms , America, Canada , A-TeluguStop.com

ప్రతీకారదాడులు, హత్యలు, దోపిడీలు, బెదిరింపుల కోసం కొందరు తుపాకులను వినియోగిస్తున్నారు.వీటి వల్ల జరిగే మారణహోమం ఎలా వుంటుందో అగ్రరాజ్యం అమెరికాను( America ) చూస్తే తెలుస్తుంది.

కానీ ఇది ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు.ఎన్నో దేశాల్లో తుపాకులు, ఇతర అక్రమ ఆయుధాల కారణంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

వీటిని అడ్డుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో అమెరికాను ఆనుకుని వుండే కెనడాలో( Canada ) అక్కడి జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) ప్రభుత్వం తుపాకుల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

తాజాగా అస్సాల్ట్ తరహా తుపాకీలపై నిషేధం విధించాలని ప్రతిపాదన తెస్తోంది.

Telugu America, Canada, Canadatrudeau, Handguns, Justin Trudeau, Publicsafety-Te

సోమవారం నాడు ప్రకటించిన ఈ పథకం ప్రకారం.కెనడియన్ మార్కెట్‌లలోకి ప్రవేశించే ముందు తుపాకుల వర్గీకరణను నిర్ధారించడానికి ప్రభుత్వం తుపాకీ చట్టాల ద్వారా నిబంధనలను రూపొందిస్తుంది.పబ్లిక్ సేఫ్టీ మంత్రి మార్కో మెండిసినో( Public Safety Minister Marco Mendicino ) మాట్లాడుతూ.

తమ ప్రభుత్వం వేటగాళ్లు, చట్టాన్ని గౌరవించే తుపాకీ యజమానులను లక్ష్యంగా చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.కుటుంబాలను, పిల్లలను రక్షించాలన్నదే తమ ప్రయత్నమని మెండిసినో అన్నారు.అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో వున్న తుపాకుల వర్గీకరణపై సిఫార్సులు చేసే సలహా కమిటీని కూడా పునర్నిర్మించాలని ట్రూడో ప్రభుత్వం భావిస్తోంది.ఈ కమిటీలో గ్రామీణులు, స్థానిక ప్రజలు, పరిశ్రమల నేతలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ , న్యాయవాదులు వుంటారని మంత్రి చెప్పారు.

కమిటీ సూచనల మేరకు నిషేధం విధించాల్సిన తుపాకుల వర్గీకరణను పెంచుతామన్నారు.ఈ వేసవి నాటికి సిఫారసులను అందించాల్సిందిగా ఇప్పటికే కమిటీని కోరినట్లు మెండిసినో చెప్పారు.

Telugu America, Canada, Canadatrudeau, Handguns, Justin Trudeau, Publicsafety-Te

కాగా.గతేడాది జనవరిలో హ్యాండ్‌గన్స్‌పై కీలక చట్టాన్ని ప్రవేశపెట్టింది ట్రూడో ప్రభుత్వం.ఇది హ్యాండ్‌గన్స్‌ను( Handguns ) దిగుమతి చేసుకోవడం, కొనుగోలు చేయడం లేదా విక్రయించడాన్ని స్తంభింపజేస్తుంది.దీని ప్రకారం కెనడాలో హ్యాండ్‌గన్స్‌ని కొనుగోలు చేయడం, విక్రయించడం, బదిలీ చేయడం, దిగుమతి చేసుకోవడం చట్ట విరుద్ధమని చర్చ సందర్భంగా ప్రధాని ట్రూడో స్పష్టం చేశారు.

ట్రూడో ప్రభుత్వం ఇప్పటికే 1,500 రకాల సైనిక శైలి తుపాకులను నిషేధించేందుకు ప్రణాళికలను రూపొందించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube