భారతీయులకు శుభవార్త: 10 లక్షల మంది వలసదారులకు కెనడా ఓపెన్ డోర్స్  

canada to welcome 10 lakh immigrants over next 3 years - Telugu, Nri, Telugu Nri News

వచ్చే మూడేళ్లలో అంటే 2022 నాటికి తమ దేశానికి 10 లక్షల మంది వలసదారులను ఆకర్షించాలని కెనడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఇది నైపుణ్యం కలిగిన ఇప్పటికే సాంకేతిక రంగంలో ఉన్న భారతీయులకు శుభవార్త.

TeluguStop.com - Canada To Welcome 10 Lakh Immigrants Over Next 3 Years

అమెరికా తన ఇమ్మిగ్రేషన్ విధానాలను కఠినతరం చేయడం కారణంగా కెనడా భారతీయులతో పాటు విదేశాలయుకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా మారింది.

కెనడాలో ఇమ్మిగ్రేషన్‌ను పర్యవేక్షించే ‘‘ ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్ షిప్’’ (ఐఆర్‌సీసీ) విడుదల చేసిన ప్రకటన ప్రకారం 2020లో 3.41 లక్షల మందికి శాశ్వత నివాసాలను కల్పించడం, దీనిని 2021లో 3.51 లక్షలు, 2022 నాటికి 3.61 లక్షలకు పెంచాలని ప్రభుత్వ లక్ష్యమని తెలిపింది.2019లో కెనడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఓపెన్ సోర్స్ డేటా ప్రకారం ఈ ఏడాది శాశ్వత నివాసి (పీఆర్) హోదా పోందిన ప్రతి నలుగురిలో ఒకరు భారతీయుడు.2019లో కెనడాకు వచ్చిన 3.41 లక్షల మందిలో 25.1 శాతం (85,585) మంది భారతదేశానికి చెందినవారే.ఇమ్మిగ్రేషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం వలసదారుల్లో భారత్ అగ్రశ్రేణి దేశంగా కొనసాగే అవకాశం ఉంది.

TeluguStop.com - భారతీయులకు శుభవార్త: 10 లక్షల మంది వలసదారులకు కెనడా ఓపెన్ డోర్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

టెక్ రంగంలో పెద్ద సంఖ్యలో నైపుణ్యం కలిగిన కార్మికులు భారతదేశం నుంచే వస్తున్నారు.

కెనడా పీఆర్ అమెరికా గ్రీన్ కార్డుతో సమానంగా ఉంటుంది.కెనడాలో ఎక్కడైనా నివసించడానికి, పని చేయడానికి, చదువుకోవడంతో పాటు తర్వాతి కాలంలో పౌరసత్వం పొందేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది.మల్టీ ఇయర్ ఇమ్మిగ్రేషన్ లెవల్ ప్రణాళికను ఇటీవల కెనడా ఇమ్మిగ్రేషన్, శరణార్ధులు, పౌరసత్వ శాఖ మంత్రి మార్కో మెండోసినో ఇటీవల ఆ దేశ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

ఇమ్మిగ్రేషన్ స్థాయిల పెరుగుదల కెనడియన్ వ్యాపారానికి, ఉద్యోగాలను సృష్టించడానికి, ఆర్ధిక వ్యవస్థను వృద్ధి చేయడానికి సహాయపడే ఒక వ్యవస్థకు అండగా నిలుస్తుందని మెండోసినో పేర్కొన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో పెరుగుతున్న వృద్ధుల కారణంగా వచ్చే సవాళ్లను ఎదుర్కోవటానికి , పోటీ ప్రపంచంలో కెనడాను నిలబెట్టేందుకు గాను నైపుణ్యం గల వలసదారులకు తలుపులు తెరిచింది.

కెనడా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ పాయింట్ల ఆధారితమైనది.

#CanadaTo

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Canada To Welcome 10 Lakh Immigrants Over Next 3 Years Related Telugu News,Photos/Pics,Images..