కెనడాలో కలకలం రేగింది.భారతీయ చిత్రాలు( Indian Movies ) ప్రదర్శితమవుతున్న మూడు థియేటర్లలో గుర్తు తెలియని రసాయన పదార్ధాన్ని స్ప్రే( Chemical Spray ) చేశారు అగంతకులు.
దీంతో ప్రేక్షకులను తక్షణం థియేటర్ల నుంచి ఖాళీ చేయించారు.గ్రేటర్ టొరంటో, బ్రాంప్టన్ ప్రాంతంలో హిందీ చిత్రాలను ప్రదర్శిస్తున్న మూడు థియేటర్లలోకి మంగళవారం ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు చొరబడ్డారు.
అనంతరం రసాయనాన్ని స్ప్రే చేశారు.దీని ధాటికి కొందరు ప్రేక్షకులు స్వల్ప అస్వస్ధతకు గురయ్యారు.
వెంటనే స్పందించిన థియేటర్ యాజమాన్యం, సిబ్బంది వారిని తక్షణం బయటకు తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్లను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
గురువారం రాత్రి యార్క్ రీజినల్ పోలీసులు( York Regional Police ) అనుమానితుల ఫోటోలను విడుదల చేశారు.టోరంటో, వాన్, బ్రాంప్టన్లలోని మల్టీప్లెక్స్‌లలో మంగళవారం రాత్రి ఈ ఘటనలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.మంగళవారం రాత్రి 9.20 గంటలకు వాన్‌లోని థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించి అత్యవసర సేవలు అందించాల్సి వచ్చింది.కెమికల్ స్ప్రే ప్రభావానికి గురి కావడంతో కొందరు ప్రేక్షకులు దగ్గుతో బాధపడ్డారు.తక్షణం 200 మందిని థియేటర్ నుంచి ఖాళీ చేయించారు అధికారులు.అయితే ఎవరూ ఎలాంటి తీవ్రమైన అస్వస్థతకు గురికాలేదని పోలీసులు వెల్లడించారు.
మొదటి నిందితుడు నల్లజాతికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.అతను ఐదడుగుల 10 అంగుళాల పొడవుతో ఓ మాదిరి పర్సనాలిటీతో వున్నట్లు చెప్పారు.నలుపు రంగు స్వెటర్, తెల్లటి లోగోతో బ్లాక్ జాకెట్, తెల్లటి గీతలున్న ముదురు రంగు ప్యాంట్, నలుపు రంగు మెడికల్ మాస్క్( Medical Mask ) ధరించాడు.
రెండో నిందితుడు ఐదు అడుగుల 8 అంగుళాల ఎత్తు, మధ్యస్తమైన శరీరంతో వున్నాడని పోలీసులు తెలిపారు.ఇతను ముదురు రంగు ప్యాంట్, బ్రౌన్ షూ, నల్లని మాస్క్, బ్లాక్ కలర్ స్వెటర్ ధరించాడు.
పీల్ రీజినల్ పోలీసుల( Peel Regional Police ) ప్రకారం.అదే రోజు రాత్రి 7.40 గంటల సమయంలో బ్రాంప్టన్‌లోని( Brampton ) గ్రేట్ లేక్స్ డ్రైవ్, బోవైర్డ్ డ్రైవ్ సమీపంలోని సినిమా థియేటర్లోనూ స్ప్రే ఘటన చోటు చేసుకుంది.భవనం పూర్తిగా ఖాళీ చేయబడినప్పటికీ, ఎవరినీ అరెస్ట్ చేయలేదు.టొరంటో పోలీసులకు కూడా రాత్రి 10.30 గంటల సమయంలో స్కార్బరో టౌన్ సెంటర్లోని థియేటర్లో ‘‘స్టింక్ బాంబ్’’( Stink Bomb ) విడుదలయ్యే అవకాశం వుందని బెదిరింపు కాల్ వచ్చింది.ప్రస్తుతం భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.దీని వెనుక ఎవరు వున్నారు.? ఎవరి కుట్ర అనేది త్వరలోనే తేలిపోనుంది.