ఆర్ధిక వృద్ధే లక్ష్యం : 4 లక్షల మంది వలసదారులకు డోర్స్ ఓపెన్.. కొత్త వ్యూహాలతో కెనడా

ఆధునిక సమాజం తెచ్చిన మార్పుల కారణంగా ఇప్పుడు ప్రపంచం ఓ కుగ్రామం అయిపోయింది.ఉన్నచోటే కూర్చుంటే జీవితంలో ఎదగలేరు.

 Canada Plans To Open Its Door To 411,000 Immigrants Next Year, Canada , Immigrat-TeluguStop.com

అందుకే కష్టమైనా నష్టమైనా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి విదేశాల బాట పడుతున్నారు ప్రజలు.ముఖ్యంగా యువత అయితే చిన్న నాటి నుంచే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని అందుకు తగినట్లుగా జీవితాన్ని మలచుకుంటున్నారు.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం ఖండాలు దాటుతున్నారు.కానీ ఒకటి రెండు దేశాలు మినహా చాలా దేశాల్లో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అందుకు అనుకూలంగా వుండవు.అయితే అత్యంత సులభతరమైన నిబంధనలతో ఇప్పుడు కెనడా.వలసదారులకు డెస్టినేషన్‌గా మారింది.ఆర్ధిక వ్యవస్థకు చేయూతను అందించేందుకు వీలుగా కెనడా రానున్న రోజుల్లో మరింత మంది వలసదారులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కోవిడ్ కారణంగా కెనడా కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది.

దీని నుంచి తప్పించుకునేందుకు గాను ఇమ్మిగ్రేషన్ విధానంలో సమూల మార్పులకు సిద్ధమవుతోంది.ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జస్టిన్ ట్రూడో రాబోయే సంవత్సరం 4,11,000 మందికి శాశ్వత పౌరసత్వం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇప్పటికే రికార్డు స్థాయిలో సంతానోత్పత్తి రేటు క్షీణిస్తుండటం, వాలంటరీ రిటైర్‌మెంట్లను దృష్టిలో పెట్టుకుని సమస్యను అధిగమించేందుకు ట్రూడో సర్కార్ కార్యాచరణను రూపొందిస్తోంది.

ఇప్పటికే కెనడాలో ఉద్యోగ ఖాళీలు రెట్టింపైనట్లు అధికారిక డేటా చూపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కెనడియన్ తయారీ, ఎగుమతిదారుల సంఘం 2030 నాటికి పరిస్ధితులు మరింత క్లిష్టంగా మారుతాయన్న నేపథ్యంలో వలసదారులకు తలుపులు తెరవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.ఇకపోతే ట్రూడో అధికారంలోకి వచ్చిన నవంబర్ 2015 నుంచి బెంచ్‌ మార్క్ ఇంటి ధరలు 77.2 శాతం పెరిగాయి.స్టాటిస్టిక్స్ కెనడా ప్రకారం.

వలసదారులు ఎక్కువగా గ్రేటర్ టొరంటో, వాంకోవర్ వంటి పెద్ద పట్టణాల్లోనే ఇల్లు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.వీటిని అదుపు చేసేందుకు ట్రూడో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాలను ఇస్తుండటంతో వచ్చే ఏడాది ఇళ్ల ధరలు దిగివస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Canada plans to open its door to immigrants next year

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube