ఎన్ఆర్ఐ దంపతుల హత్య: ముగ్గురి అరెస్ట్, అద్దెకుండే వ్యక్తే సూత్రధారి  

Canada Nri Couple Punjab Tenant - Telugu Canada, Mureder, Nri Couple, Punjab, Tenant Among Three Held For Nri Couple’s Murder In Punjab

పంజాబ్‌లో సంచలనం సృష్టించిన వృద్ధ ఎన్ఆర్ఐ జంట హత్య కేసును పోలీసులు ఛేదించారు.ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఫగ్వారా ఎస్ఎస్‌పీ వెల్లడించారు.

 Canada Nri Couple Punjab Tenant

మృతుల ఇంట్లో అద్దెకు ఉంటున్న జగదేవ్ సింగ్ తన ఇద్దరు మిత్రులతో కలిసి వృద్ధ జంటను అత్యంత దారుణంగా హతమార్చినట్లు ఆయన తెలిపారు.

పంజాబ్‌లోని ఫగ్వారాకు చెందిన కిర్పాల్ సింగ్ మిన్హాస్ (67), దేవిందర్ కౌర్ (65) దంపతులు కెనడాలో స్థిరపడ్డారు.

ఎన్ఆర్ఐ దంపతుల హత్య: ముగ్గురి అరెస్ట్, అద్దెకుండే వ్యక్తే సూత్రధారి-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో భారతదేశానికి వెళ్లి కొన్నాళ్లు గడుపుదామని భావించి గతేడాది నవంబర్‌లో ఫగ్వారాకు వచ్చారు.కొన్ని నెలల తర్వాత తిరిగి కెనడాకు వెళ్లాల్సిన వీరి ఆశలపై కరోనా నీళ్లు చల్లింది.

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 విరుచుకుపడటంతో లాక్‌డౌన్‌ను విధించారు.

అయితే కేంద్రం లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా వివిధ దేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడంతో పాటు మనదేశంలో చిక్కుకున్న విదేశీయులను వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రత్యేక విమానాలను నడుపుతోంది.

దీంతో కిర్పాల్ దంపతులు కెనడా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అయితే ఉన్నట్లుండి ఈ దంపతులు దారుణహత్యకు గురయ్యారు.

కిర్పాల్ ఇంట్లో అద్దెకు ఉండే ఓ వ్యక్తి ఈ హత్యలు జరిగిన తర్వాతి నుంచి కనిపించకుండా పోవడంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టి కేసును ఛేదించారు.ఫ్రెండ్స్ కాలనీకి చెందిన సూరజ్ కుమార్, హర్యానాకు చెందిన అతని స్నేహితుడు రంజీత్ సింగ్‌‌‌లు జగదేవ్‌ సింగ్‌తో కలిసి కిర్పాల్ ఇంట్లోకి ప్రవేశించి వారిద్దరిని పదునైన ఆయుధంతో హత్య చేశారు.అనంతరం రూ.12,000 నగదు, రెండు బంగారు గాజులు, మొబైల్ ఫోన్లను దోచుకుని పరారయ్యారు.రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి సూరజ్‌ను ఫగ్వారాలో, జగ‌దేవ్, రంజీత్‌లను హర్యానాలో అదుపులోకి తీసుకున్నారు.వీరిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Canada Nri Couple Punjab Tenant Related Telugu News,Photos/Pics,Images..

footer-test