అమెరికా పొమ్మంటే..కెనడా రమ్మంటోంది..       2018-06-26   04:09:11  IST  Bhanu C

అగ్రరాజ్యం అనేది పేరుకే తప్ప అమెరికాతో ఒరిగేది మాత్రం సూన్యం అని దాదాపు అన్ని దేశాలకి అర్థం అయ్యింది అందుకే ఒక్కొక్కరుగా అమెరికా విడిచి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు..ఎంతో మంది విదేశీయులు ముఖ్యంగా భారతీయులు తమ తెలివితేటలు విజ్ఞానాన్ని అంతటిని అమెరికాకి అందించి అమెరికాని అగ్రగామి దేశంగా మలిచితే ఇప్పుడు అవడం అయ్యిందని ఒక్కొక్కరిని ఒక్కో ఒంకతో తన్ని తరిమేస్తున్నారు..సరే ఇవన్నీ పక్కన పెడితే.. అమెరికా అక్కడి భారతీయ ఉద్యోగులతో పాటుగా భారతీయ విద్యార్ధులపై కూడా ఎన్నో ఆంక్షలు పెడుతున్న విషయం విదితమే..అయితే ఈ క్రమంలో అమెరికా భారత విద్యార్ధులని పొమ్మంటే పక్క దేశం అయిన కెనడా మాత్రం రమ్మని సాదర స్వాగతం చెప్తోంది..

భారత్ తోపాటు మరో మూడు దేశాల విద్యార్థులు వేగంగా వీసాలు పొందేలా కెనడా నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది..ఈ విధానం ప్రకారం కెనడాలో చదువుకోవాలని అనుకునే వారికి ప్రస్తుతం జారీ చేస్తున్న వీసా విధానంలో భారీ మార్పులు చేయడంతోపాటు వీసా జారీ ప్రక్రియ సమయాన్ని పూర్తిగా తగ్గించింది. అధికారిక లెక్కల ప్రకారం లక్ష మంది భారతీయ విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. విద్యా అనుమతుల కోసం పెరుగుతున్న దరఖాస్తులకు మద్దతుగా నిలువడంతోపాటు భారత్ – చైనా – వియత్నాం – ఫిలిప్పీన్స్ దేశాల విద్యార్థులకు మేలు చేకూరేలా కెనడా వలస శరణార్థి పౌరసత్వ విభాగం స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీం (ఎస్ డీఎస్) విధానాన్ని ప్రకటించింది.

అయితే ఇటీవల బ్రిటన్ సైతం తమ యూనివర్సిటీల్లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు వీసా నిబంధనలను మరింత సడలించింది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ విధానంలో చేసిన సవరణలను బ్రిటన్ హోం శాఖ శుక్రవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. విదేశీ విద్యార్థులకు టైర్-4 వీసా నిబంధనలను మరింత సరళతరం చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ జాబితాలో మాత్రం భారత్ కి మాత్రం చోటు కల్పించలేదు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భారతీయులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది…ఈ క్రమంలోనే కెనడా సాదర స్వాగతం తెలపడం తో భారత విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

కెనడా వలస – శరణార్థి – పౌరసత్వ విభాగం స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీం (ఎస్ డీఎస్) విభాగంలో విద్యార్థులు ప్రవేశాలు కావాలని అనుకుంటే మాత్రం వారికి అదనపు అర్హతలు ఉండాలని తెలిపింది..ఈ వ్యవస్థ ద్వారా కెనడాకు వెళ్లే విద్యార్థులకు శాశ్వత నివాసం – పౌరసత్వం విషయంలో ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ ఎస్ డీఎస్ కు అవసరమయ్యే సమాచారం విద్యార్థుల వద్ద లేకపోతే సాధారణ విద్యా అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

,