కెనడా : క్యూబెక్ అసెంబ్లీ ఎన్నికల బరిలో భారత సంతతి వ్యక్తి

భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో వున్న కెనడాలో ఇప్పుడు ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి.

 Canada: Indian Origin Jaspal Singh Ahluwalia Contesting Quebec Assembly Election-TeluguStop.com

కెనడాకు దగ్గరవుతున్నారు.ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం ఈ విషయాన్ని చెబుతున్నాయి.

ఇకపోతే కెనడాలోనూ భారతీయులు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.ఇప్పటికే జస్టిన్ ట్రూడో మంత్రి వర్గంలో మంత్రులుగా పలువురు స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

అలాగే చట్టసభ సభ్యులుగా, రాజకీయ పార్టీ నేతలుగానూ భారతీయులు రాణిస్తున్నారు.

తాజాగా కెనడాలోని కీలక ప్రావిన్స్‌ల్లో ఒకటైన క్యూబెక్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ ఎన్నికల్లో పంజాబీ సంతతికి చెందిన జస్పాల్ సింగ్ అహ్లువాలియా బరిలో నిలిచారు.ప్రస్తుతం మాంట్రియల్ బ్లాక్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన వౌడ్రూయిల్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

అంజు ధిల్లాన్ ఈ ప్రావిన్స్ నుంచి హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక పంజాబీ కమ్యూనిటీ వ్యక్తి.అయితే క్యూబెక్ అసంబ్లీలో మాత్రం ఏ పంజాబీ నాయకుడూ ప్రాతినిథ్యం వహించకపోవడం గమనార్హం.

అహ్లువాలియాతో పాటు మరో భారతీయుడు దీపక్ అవస్తీలారియర్ డోరియన్ నుంచి పోటీ చేస్తున్నారు.

Telugu Anita Anand, Anju Dhillon, Canada, Harjit Sajjan, Indian Origin, Jaspalsi

ఇకపోతే… కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని జస్టిన్ ట్రూడోకి చెందిన లిబరల్స్ పార్టీ మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే.అయితే, ఈసారి ఎన్నికల బరిలో 49 మంది భారతీయ సంతతి వ్యక్తులు పోటీపడగా.వీరిలో 19 మంది విజయం సాధించారు.

విజేతలుగా నిలిచిన వారిలో ట్రూడో క్యాబినెట్‌లోని ముగ్గురు సిట్టింగ్ మంత్రులు ఉన్నారు.రక్షణ మంత్రి హర్జీత్‌ ఎస్‌ సజ్జన్‌ వాంకోవర్ సౌత్ నుంచి మరోసారి ఎన్నికయ్యారు.

ప్రజా సేవల విభాగం మంత్రి అనితా ఆనంద్ ఒంటారియోలోని ఓక్‌విల్లే నుంచి గెలుపొందగా.మరో మంత్రి బర్డిశ్ ఛాగర్ వాటర్లూ నుంచి విజయం సాధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube