కెనడాలో ‘‘ పర్మినెంట్ రెసిడెన్సీ ’’ ఇకపై కాస్ట్‌లీ గురు .. నెలాఖరు నుంచే అమల్లోకి

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం కెనడా, అమెరికా వెళ్లి శాశ్వత పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడాలనుకునే వారికి ఆయా దేశాలు షాకిస్తున్నాయి.

ఏప్రిల్ 1 నుంచి హెచ్ 1 బీ, ఎల్ 1, ఈబీ 5 వీసా రుసుములను అమెరికా పెంచిన సంగతి తెలిసిందే.

తాజాగా కెనడా( Canada ) సైతం అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతోంది.ఇమ్మిగ్రేషన్ , రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) ప్రకటించిన విధంగా.

కెనడాను తమ శాశ్వత నివాసంగా మార్చుకోవాలనుకునే ఔత్సాహిక వలసదారులు అదనపు రుసుములను భరించాల్సి వుంటుంది.న్యూస్ 18 నివేదిక ప్రకారం .కెనడియన్ ప్రభుత్వం మార్చి 30న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ‘‘శాశ్వత నివాసం హక్కు’’లో సుమారు 12 శాతం పెరుగుదలను ప్రకటించింది.ఇది ఈ నెలాఖరు నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.

ఏప్రిల్ 30, 2024 నుంచి కెనడాలో శాశ్వత నివాసం( Canada Permanent Residency ) పొందడానికి రుసుము ప్రస్తుతం 515 కెనడియన్ డాలర్స్ నుంచి 575 కెనడియన్ డాలర్స్‌కి పెరుగుతుంది.ఇది దాదాపు 12 శాతం గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది.

Advertisement

కెనడాలో శాశ్వాత నివాసం పొందడం అనేది అమెరికాలో గ్రీన్ కార్డ్‌ను పొందడం వంటిది.

శాశ్వత నివాస స్థితి కోసం దరఖాస్తు సమయంలో ఈ నిర్దిష్ట రుసుము చెల్లించబడుతుంది.అయితే కుటుంబాలకు ఊరట కలిగించేందుకు గాను శాశ్వత నివాసం కోరుకునే దరఖాస్తుదారుల పిల్లలకు కెనడా ప్రభుత్వం( Canada Government ) రుసుమును మినహాయించింది.శాశ్వత నివాసంతో పాటు ఇతర ఇమ్మిగ్రేషన్ స్ట్రీమ్‌ల ఖర్చులను కూడా కెనడా పెంచుతోంది.ఫెడరల్ స్కిల్డ్ వర్కర్స్, ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్, క్యూబెక్ స్కిల్డ్ వర్కర్స్, అట్లాంటిక్ ఇమ్మిగ్రేషన్ క్లాస్, ఎకనామిక్ పైలట్‌లు (గ్రామీణ, అగ్రి ఫుడ్) అలాగే వారి జీవిత భాగస్వాములు,

లేదా ఉమ్మడి న్యాయ భాగస్వాముల కోసం దరఖాస్తులు 850 కెనడియన్ డాలర్ల నుంచి 950 కెనడియన్ డాలర్లకు పెరగనున్నాయి.వీరిపై ఆధారపడిన పిల్లల రుసుమును 230 కెనడియన్ డాలర్ల నుంచి 260 కెనడియన్ డాలర్లకు పెంచారు.అదే విధంగా లైవ్ ఇన్ కేర్‌గివర్ ప్రోగ్రామ్, కేర్‌గివర్స్ పైలట్‌లు , వారి జీవిత భాగస్వాములు లేదా కామన్ లా పార్టనర్‌లకు సంబంధించిన ఫీజులు 570 కెనడియన్ డాలర్ల నుంచి 635 కెనడియన్ డాలర్లకు పెంచారు.

డిపెండెంట్ చైల్డ్ రుసుము 155 కెనడియన్ డాలర్ల నుంచి 175 కెనడియన్ డాలర్లకు పెంచినట్లుగా నివేదిక పేర్కొంది.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు