భారత హై కమిషన్ : ఇది జాతి వివక్ష హత్యే....భారతీయుల భద్రతకు భరోసా ఏది..

గతంలో భారతీయులపై జాతి వివక్ష దాడులు అనగానే అగ్ర రాజ్యం అమెరికానే గుర్తుకు వచ్చేది.అమెరికాలో ట్రంప్ హయాంలో భారతీయులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి.

 Canada High Commission Respond Prabhajot Sing Death , Canada, Indian, Prabha Jo-TeluguStop.com

అయితే జాతి విద్వేష దాడులు జరిగినపుడు కటినమైన చట్టాలని అమెరికా ప్రభుత్వం అనుసరించడంతో దాడులు క్రమేపి తగ్గుముఖం పడ్డాయి.అయితే తాజాగా కెనడాలో భారతీయ యువకుడి పై జరిగిన జాత్యహంకార దాడి సంచలనం సృష్టించింది.

ఉపాది కోసం కెనడా వెళ్ళిన 23 ఏళ్ళ ప్రభ జోత్ సింగ్ ను అతడు ఉంటున్న అపార్ట్మెంట్ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపేసి వెళ్ళిపోయారు.ఈ ఘటన కెనడాలోని యావత్ భారతీయ సమాజాన్ని కదిలించింది.

ప్రభ జోత్ హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కాగా ఈ ఘటనపై కెనడాలోని అమెరికా హై కమిషన్ ఘాటుగా స్పందించింది.కెనడాకు ఎంతో మంది భారత్ నుంచీ వస్తున్నారని ఇలాంటి సంఘటనలు జరిగితే కెనడాలో ఉన్న వేలాది భారతీయుల భద్రతకు భరోసా ఎలా ఉంటుందని ప్రశ్నించింది.ఇలాంటి ఘటనలు జరిగినపుడు భారతీయులలో ఆందోళన నెలకొంటుందని అందుకు ప్రతిగా కెనడా ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరింది.

భారత పౌరులు మరో సారి జాతివివక్ష దాడులకు గురికాకుండా కాపాడాలని, అందుకు తగ్గ రక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది.గతంలో కూడా కొందరు విద్యార్ధులపై ఇదే తరహా దాడులు జరిగాయని గుర్తు చేసింది.

కాగా కెనడాలో ఉన్న భారత సమాజం మాత్రం ప్రభ జోత్ సింగ్ పై జరిగింది జాతి వివక్ష హత్యేనని అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు.భారతీయ యువకుడు మృతిని భారత ఎన్నారైలు అందరూ ముక్త ఖంటంతో ఖండిస్తున్నారు.

అతడి మృత దేహాన్ని తరలించడానికి GO FUND ME ద్వారా నిధులు సేకరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube