కెనడాలో కూడా భారతీయులదే హవా..!!!

భారతీయ విద్యార్ధులు విదేశీ విద్య చదవాలంటే అమెరికాకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే వారు.అమెరికాలో చదువుకోవడం, అక్కడే స్థిరపడటం వారి కలగా భావించే వారు.

 Canada Grants 1 39 Lakh Study Permits To Indian Students-TeluguStop.com

అయితే ట్రంప్ వలస వాసుల అమెరికా ఎంట్రీ పై విపరీతమైన ఆంక్షలు పెట్టడంతో పాటు, స్టూడెంట్ వీసా లో అమలు చేసిన ఖటినమైన నిభందనలతో భారతీయ విద్యార్ధులు విసిగిపోయారు.ఈ క్రమంలోనే స్టూడెంట్ వీసాలో వెసులుబాటు ఇచ్చే దేశంకోసం ఎదురు చూస్తున్న క్రమంలో కెనడా ప్రభుత్వం వలస స్టూడెంట్ వీసాలకి తలుపులు తెరిచింది.
కెనడా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ 2019 ఏడాదికి గాను రికార్డ్ స్థాయిలో 1.39 లక్షల మంది భారతీయ విద్యార్ధులకి స్టడీ పర్మిట్ లు జారీ చేసింది.ఈ ఏడాదిలో మొత్తం 4 లక్షల మంది విదేశీ విద్యార్ధులకి స్టడీ పర్మిట్లు జారీ చేయగా వాటిలోసుమారు 1.39 లక్షల మంది భారతీయ విద్యార్ధులు ఉండటం ఓ విశేషం.దాంతో కెనడాలో కూడా భారతీయ విద్యార్ధుల హవా మొదలయ్యిందని అంటున్నారు నిపుణులు…ఇదిలాఉంటే
గతంలో కంటే ప్రస్తుతం కెనడాలో చదువుకునే భారతీయ విద్యార్ధుల శాతం 34.5 గా మారింది.భారత్ తరువాతి స్థానంలో చినా రెండో స్థానంలో ఉంది.చైనాకి చెందిన 84,710 మంది విద్యార్ధులు కెనడాలో స్టడీ పర్మిట్లు పొందారు.ఇక 2018 లో కెనడా విదేశీ విద్యార్ధులకి 3.55 లక్షల స్టడీ పర్మిట్లు జారీ చేసింది.అమెరికాలో ఉన్న వలస విద్యార్ధులలో భారతీయ విద్యార్ధులు అత్యధికంగా ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube