కెనడా ఎన్నికలు: పోటీలో వున్న భారత సంతతి అభ్యర్ధులపై జాతి విద్వేషం... బెదిరింపులు, దాడులు

మెరుగైన జీవితం కోసమో, కుటుంబ ఆర్ధిక పరిస్ధితుల వల్లనో లక్షలాది మంది భారతీయులు పొట్ట చేతపట్టుకుని వివిధ దేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.అయితే అపారమైన ప్రతిభా పాటవాలతో పాటు శ్రమించే గుణం భారతీయులు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

 Canada Elections Racism Against Candidates Of Indian Descent Threats Attacks-TeluguStop.com

ఇది చూసి ఆయా దేశాల్లోని స్థానికులకు కంటగింపుగా మారింది.ఎక్కడి నుంచో వచ్చి తమ అవకాశాలను కొల్లగొడుతున్నారనే అక్కసుతో జాతి, వర్ణ వివక్షను చూపుతూ భారతీయులను మానసికంగా కృంగదీస్తున్నారు.

ఇక హత్యలు, భౌతిక దాడుల సంగతి సరేసరి.నిత్యం ప్రపంచంలోని ఏదో ఒక మూల భారతీయులపై జాత్యహంకార దాడులు జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

 Canada Elections Racism Against Candidates Of Indian Descent Threats Attacks-కెనడా ఎన్నికలు: పోటీలో వున్న భారత సంతతి అభ్యర్ధులపై జాతి విద్వేషం… బెదిరింపులు, దాడులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భారతీయులే కాదు.మిగిలిన దేశాల ప్రజలు కూడా వలస వెళ్లిన ప్రాంతంలోని స్థానికులకు లక్ష్యంగా మారుతున్నారు.

అసలు సంగతిలోకి వెళితే భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో వున్న కెనడాలో ఇప్పుడు ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి కెనడాకు దగ్గరవుతున్నారు.

ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం ఈ విషయాన్ని చెబుతున్నాయి.ఇకపోతే కెనడాలోనూ భారతీయులు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.ఇప్పటికే జస్టిన్ ట్రూడో మంత్రి వర్గంలో మంత్రులుగా పలువురు స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.అలాగే చట్టసభ సభ్యులుగా, రాజకీయ పార్టీ నేతలుగానూ భారతీయులు రాణిస్తున్నారు.

భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ ఈసారి కింగ్ మేకర్‌గా మారే అవకాశం వుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.ఆయన సారథ్యంలోని న్యూడెమొక్రాటిక్ పార్టీ‌కి భారీగానే సీట్లు లభిస్తాయని అంచనా.

అయితే భారతీయుల ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు విద్వేషంతో రగిలిపోతున్నారు.ఈ నేపథ్యంలోనే కెనడా ఫెడరల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పంజాబ్ సంతతి అభ్యర్ధులు జాతి విద్వేష దాడులను ఎదుర్కొంటున్నారు.సర్రే సెంటర్‌ నుంచి మరోసారి ఎన్నికవ్వాలని చూస్తోన్న లిబరల్ పార్టీ అభ్యర్ధి రణదీప్ సింగ్ సరాయ్‌ ప్రచార పోస్టర్‌పై కొందరు దుండగులు నాజీలకు చిహ్నామైన స్విస్తిక్‌‌ను గీశారు.దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన సరాయ్.

ఈ తరహా చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.ఇక మరొక ఘటనలో కాల్గరీ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న లిబరల్ పార్టీ అభ్యర్ధి సబ్రినా గ్రోవర్‌ వాలంటీర్లపై ఎన్నికల ప్రచారంలోనే ఇద్దరు దాడి చేశారు.

దీనిపై సబ్రినా స్పందిస్తూ వాలంటీర్లు ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రచారం చేస్తుండగా ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి చెంపదెబ్బ కొట్టాడని తెలిపారు.తన వాలంటీర్లు ఇద్దరూ క్షేమంగానే వున్నారని.

ఇది సరైన చర్య కాదని ఆమె ఖండించారు.తాను కాల్గరీలోనే పుట్టి పెరిగానని ఇది తన సొంత ఇల్లు అని తేల్చి చెప్పారు.

ఇక ఎన్‌డీపీ నేత జగ్మీత్ సింగ్‌ అంటారియోలోని విండ్సర్‌లో ప్రచారం చేస్తుండగా జాత్యహంకార వ్యాఖ్యలను ఎదుర్కొన్నారు.ఒక పార్కులో జరిగిన కార్యక్రమంలో జగ్మీత్ పాల్గొన్నారు.ఆ సమయంలో కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఇంటికి తిరిగి వెళ్ళు’’ అని నినాదాలు చేశాడు.అంటారియోలోని స్కాబరో‌లో జన్మించి విండ్సర్‌లో పెరిగిన జగ్మీత్ సింగ్ ఈ వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించడం గమనార్హం.

ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ ఇలాంటి విషయాలను తాను పట్టించచుకోనని, అయితే కెనడాలో పెరుగుతున్న ద్వేషం గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.సర్రే టింబర్ గ్రీన్స్ ఎమ్మెల్యే, జాతి వివిక్ష వ్యతిరేక కార్యక్రమాల పార్లమెంటరీ కార్యదర్శి రచనా సింగ్ మాట్లాడుత .ప్రచార సమయంలో, అభ్యర్ధుల హోర్డింగ్‌లను ద్వేష సందేశాలతో ధ్వంసం చేశారని మండిపడ్డారు.ఇలాంటివి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని.

పిరికితనమంటూ రచనా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

#Libral Party #Sabrina Growar #Attacks #Candidates #Jagmeeth Singh

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు