కెనడా : కోర్టులో చుక్కెదురు.. నిషేధిత సిక్కు సంస్థ సభ్యుడికి దేశ బహిష్కరణ

నిషేధిత ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్) మాజీ అధ్యక్షుడిగా చెబుతున్న వ్యక్తికి కెనడా కోర్టులో చుక్కెదురైంది.అతని పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేయడంతో త్వరలోనే ఆయన దేశ బహిష్కరణకు గురికానున్నారు.

 Canada: Alleged Member Of Proscribed Isyf May Be Deported To India, Canada, Isyf-TeluguStop.com

అక్టోబర్ చివరిలో ఒట్టావాలోని ఫెడరల్ కోర్ట్ న్యాయమూర్తి మెక్‌వీగ్.రంజిత్ సింగ్ ఖల్సా వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించారు.మెట్రో వాంకోవర్ ప్రాంతానికి చెందిన ఖల్సా.జూన్ 18, 2003న కెనడాలో లిస్టెడ్ టెర్రరిస్ట్‌గా అవతరించిన ఐఎస్‌వైఎఫ్‌లో సభ్యుడిగా వున్నందుకు గాను ఇమ్మిగ్రేషన్ అండ్ శరణార్ధుల రక్షణ చట్టం ప్రకారం కెనడాకు అనుమతించబడడని ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ బోర్డ్ (ఐఆర్‌బీ) అనుబంధ ఇమ్మిగ్రేషన్ విభాగం (ఐడీ) తెలిపింది.

అయితే తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రంజిత్ కోర్టుకెక్కాడు.కెనడియన్ ఔట్‌లెట్ గ్లోబల్ న్యూస్‌కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ స్టీవర్ట్ బెల్… రంజిత్ విషయంపై ట్వీట్ చేస్తూ ఐఎస్‌వైఎఫ్ సభ్యునిపై ఇమ్మిగ్రేషన్ విభాగం బహిష్కరణ ఉత్తర్వులను ఫెడరల్ కోర్టు సమర్ధించిందని తెలిపారు.

అంతేకాదు ఖల్సా సదరు నిషేధిత సంస్ధకు అధ్యక్షుడిగా కూడా వున్నట్లు బెల్ ఆరోపించారు.

Telugu Canada, Canadaalleged, India, Isyf, Ranjit Singh, Sikh-Telugu NRI

రంజిత్ సింగ్ 1988లో కెనడాకు వచ్చి శరణార్ధిగా దరఖాస్తు చేసుకున్నాడు.అనంతరం 1992లో శాశ్వత నివాసిగా మారాడు.అయితే కెనడా పౌరసత్వం కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును .ఐఎస్‌వైఎఫ్‌తో సంబంధాల కారణంగా కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (సీబీఎస్ఏ) అనుమతించలేదు.అటు ఐఆర్‌బీ అనుబంధ ఇమ్మిగ్రేషన్ విభాగం సైతం ఈ ఏడాది ఫిబ్రవరి 25న సీబీఎస్ఏ నిర్ణయాన్ని సమర్ధిస్తూ.రంజిత్ సింగ్‌కు దేశ బహిష్కరణను విధించింది.

కాగా.పబ్లిక్ సేఫ్టీ కెనడా ఉగ్రవాద సంస్థల లిస్ట్‌లో ఐఎస్‌వైఎఫ్‌ వుంది.1984 నుంచి దాని సభ్యులు భారత రాజకీయ ప్రముఖులకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో పాటు సిక్కు సమాజంలోని మితవాద సభ్యులపై తీవ్రవాద దాడులు, హత్యలు, బాంబు దాడులు జరుపుతున్నట్లు పబ్లిక్ సేఫ్టీ కెనడా తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube