కెనడా: బ్రిటిష్ కొలంబియా ఎన్నికల్లో భారతీయుల హవా..!!!

ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల సందడి మొదలైంది.నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో నిలవడంతో ఆమె గెలుపును కాంక్షిస్తూ ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయులు హరిస్‌కు మద్ధతు తెలుపుతున్నారు.

 Canada: 8 Punjabis Win British Columbia Elections, British Columbia Elections, P-TeluguStop.com

తాజాగా అమెరికాకు పక్కనేవున్న కెనడాలో భారతీయులు వార్తల్లోకెక్కారు.బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో జరిగిన ఎన్నికల్లో 8 మంది పంజాబీలు ఘన విజయం సాధించారు.

వీరిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం.వీరంతా కూడా అధికార న్యూడెమొక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ)కి చెందినవారే.
భారత సంతతికి చెందిన జగ్మీత్‌ సింగ్‌ నేతృత్వంలో నడుస్తోన్న ఎన్‌డిపి.తాజా విజయంతో 87 అసెంబ్లీ స్థానాలకు గానూ .41 స్థానాల నుండి 55 స్థానాలకు ఎగబాకింది.బ్రిటీష్‌ కొలంబియా చరిత్రలో ఎన్‌డిపికి భారీ విజయం దక్కిందని స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి.

గెలిచిన ఎనిమిది మందిలో ముగ్గురు ఐదోసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం విశేషం.కార్మిక మంత్రి హ్యారీ బైన్స్, డిప్యూటీ స్పీకర్ రాజ్ చౌహాన్, పార్లమెంటరీ కార్యదర్శి జాగ్రూప్ బ్రార్ ఇలా వరుసగా ఐదోసారి విజయం సాధించారు.

సర్రే-న్యూటన్ నుంచి గెలిచిన బెయిన్స్ లిబరల్ పార్టీకి చెందిన పాల్ బోపోరాయ్‌ను ఓడించారు.

బర్నాబీ-ఎడ్మండ్స్ నుంచి గెలిచిన చౌహాన్.

లోక్ సభ మాజీ డిప్యూటీ స్పీకర్, ఎస్ఏడీ నాయకుడు చరంజిత్ సింగ్ అట్వాల్ కుమార్తె(లిబరల్ పార్టీ)పై భారీ మెజారిటీతో గెలిచారు.బ్రార్ మరోసారి సర్రే-ఫ్లీట్‌వుడ్ సీటును నిలుపుకున్నారు.

కాగా, సర్రే-గ్రీన్ టింబర్స్ నుంచి రచనా సింగ్ విజయం సాధించారు.లిబరల్ పార్టీకి చెందిన దిల్‌రాజ్ అత్వాల్‌ను ఆమె ఓడించారు.

అలాగే రవి కహ్లాన్ మరోసారి డెల్టా నార్త్‌ సీటును దక్కించుకున్నారు.అమన్ సింగ్ రిచ్మండ్-క్వీన్స్‌బరో నుండి జాస్ జోహాల్‌పై అలవోక విజయం సాధించారు.

జిన్నీ సిమ్స్, నికీ శర్మ వరుసగా సర్రే-పనోరమా, వాంకోవర్-హేస్టింగ్స్ నుండి గెలిచారు.మరోవైపు ఈ మహమ్మారి నుండి బయటపడేందుకు ప్రజలకు సాయం, వారికి అవసరమైన సేవలు అందించేందుకు తాము దృష్టి సారిస్తామని భరోసా ఇవ్వాలనుకుంటున్నట్లు బ్రిటీష్‌ కొలంబియా అధిపతి జాన్‌ హోర్గన్‌ తెలిపారు.

ఎవరీ జగ్మీత్ సింగ్:

Telugu Britishcolumbia, Canada, Canadapunjabis, Jagmeet Singh, Punjabis-Telugu N

జగ్మీత్‌ సింగ్‌ భారతీయ మూలాలున్న వ్యక్తి .పంజాబ్‌కు చెందిన ఆయన తల్లిదండ్రులు కెనడాలోని ఒంటారియోలో స్థిరపడ్డారు.అక్కడే పుట్టి పెరిగిన జగ్మీత్‌ 2001లో సైన్స్‌ సబ్జెక్ట్‌తో డిగ్రీ పూర్తి చేశారు.ఆ తరువాత యార్క్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.ఆయనకు తమ్ముడు గురంటన్‌, చెల్లి మన్‌జోత్‌ ఉన్నారు.ప్రస్తుతం ఒంటారియో అసెంబ్లీ సభ్యుడైన గురంటన్‌ తన అన్నకు రాజకీయాల్లో పూర్తి సహకారం అందిస్తున్నారు.

న్యాయశాస్త్రం చదివిన జగ్మీత్‌ కొంతకాలం క్రిమినల్‌ డిఫెన్స్‌ లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు.మానవహక్కులు, సామాజిక అంశాలకు సంబంధించిన పలు కీలక కేసులు వాదించారు.

వివిధ న్యాయశాస్త్ర సంస్థలకు పని చేశారు.న్యాయ సంబంధ విషయాలపై ఉచిత సెమినార్లు ఇచ్చారు.

సమానత్వంపై గొంతెత్తిన ఆయన స్వలింగ సంపర్క, ట్రాన్స్‌జెండర్ల (ఎల్‌జీబీటీక్యూ)కూ మద్దతుగా నిలిచారు.వారి హక్కుల కోసం పోరాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube