ఇది విన్నారా.. ! ఆడవాళ్లు గుండు గీయించుకుంటే మంచి భర్త వస్తాడట. !

ఈ భూప్రపంచంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకంగా వింత ఆచారాలు, సంప్రదాయాలు, కట్టు బాట్లు ఉంటాయి.అలాగే మరెన్నో నమ్మకాలను కూడా చాలా మంది ప్రజలు ఇప్పటిదాకా విశ్వసిస్తూ వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు.

 Can You Hear It If Females Shave Their Head Good Husband Will Come, Wife And Hus-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక వింత ఆచారం గురించి మీరు తప్పకుండా తెలుసుకుని తీరాలి.సాధారణంగా ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి మరీ పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తాం.

అలాగే మంచి భర్త, అత్త మామలు రావాలని పెళ్లికాని అమ్మాయిలు ఎన్నో పూజలు కూడా చేయడం మనం వినే ఉంటాం.అయితే ఈ ప్రాంతంలో మాత్రం అంతా వెరైటీ అన్నమాట.

ఈ ప్రాంతంలో నివసించే ఆడపిల్లలు మంచి భర్త రావాలంటే గుండు గీయించుకోవాలట.అలా జుట్టు కత్తిరించుకున్నా, లేదంటే గుండు కొట్టించుకున్నా.మంచి భర్త వస్తాడని అక్కడి ప్రజలు ఎంతగానో విశ్వసిస్తారు.అసలు ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ ఉంది? ఏంటి అనే వివరాలు ఒకసారి తెలుసుకుందాం.

ఆడపిల్లలకు జుట్టే అందం అని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.ప్రతి మహిళ కూడా మంచి జుట్టు ఉండాలని కోరుకుంటుంది.

కానీ దక్షిణాఫ్రికాలోని ఇథోపియా, సోమాలియా దేశాల్లో స్థిరపడిన బోరానా తెగకు చెందిన ఆడపిల్లలు మాత్రం పెళ్లి తర్వాత జుట్టు పెంచరు.వివాహానికి ముందే జుట్టు కత్తిరించేసుకోవాలి లేదంటే గుండు అన్నా చేయించుకోనే వింత ఆచారం ఇక్కడ ఉంది.

ఈ తెగ ప్రజలు సుమారు 500 మంది దాక ఉంటారు.ఇక్కడ పితృస్వామ్య వ్యవస్థ నడుస్తుంది.

అంటే కుటుంబంలో మగవారి మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట.ఆడవారు ఇంట్లో ఉండి ఇంటి పనులు, అలంకరణ, సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు.

అలాగే ఈ బోరానా తెగలో ఆడపిల్లలు పెళ్లికి ముందు వరకు మాత్రమే జుట్టు పెంచుకుంటారు.ఆ తరువాత పెళ్లి ప్రయత్నాలు మొదలయితే పాపం ఇక వారు జుట్టుపై ఆశలు వదులుకోవాల్సిందే.

Telugu Borana Tribes, Traditional, Ethiopia, Females Shave, Somalia, Africa, Lat

మంచి భర్త రావాలంటే ఇలా జుట్టును త్యాగం చేయక తప్పదట.అలాగే ఎంత ఎక్కువ జుట్టు కత్తిరించుకుంటే అంత మంచి భర్త వస్తాడని అక్కడి ప్రజల నమ్మకం.ఏకంగా మొత్తం గుండు చేయించుకుంటే మంచి భర్తతో పాటు అత్తమామలు కూడా మంచివారు వస్తారని బొరానా ప్రజల నమ్మకం.అందుకే అక్కడ ఆడవాళ్లు గుండుతో కనిపిస్తే వారికి పెళ్లయిందని అర్ధం.

అలాగే జుట్టుతో ఉంటే వారికి పెళ్లికాలేదని అర్ధం అన్నమాట.అలాగే ఈ తెగలో ఉన్న ఇంకొక వింత ఆచారం ఏంటంటే ఎంత పొడవు జుట్టు ఉంటే మగవారు అంత అదృష్టవంతుడని అక్కడి జనాలు నమ్ముతారు.

ఇక్కడ అంతా జుట్టు విషయంలో రివర్స్ అన్నమాట.అలాగే బోరానా ప్రజలు ఫొటోలు దిగరు.

ఫొటోలు తీయించుకుంటే వారి శరీరం అంతా రక్తంతో తడిచి ముద్ద అవుతుందని వారు నమ్ముతారు.వీరి మీద పరిశోధన చేసిన శాస్ర్రవేత్తలు వీరికి తెలియకుండా ఫొటోలు తీయడంతో ఈ తెగ ప్రజలకు సంబంధించిన ఫొటోలు మనకు గూగుల్ లో కనిపిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube