ఇది విన్నారా ..? భగవద్గీత పోటీల్లో ముస్లిం బాలుడికి ప్రథమ బహుమతి

ఏదైనా నేర్చుకోవాలనే తపన, పట్టుదల ఉండాలి కానీ దానికి మతం .కులం అనేవి అడ్డురావని నిరూపించాడు ఓ ముస్లిం బాలుడు.

ఇతడి ప్రతిభకు ఇప్పడు అంతా ఫిదా అయిపోతున్నారు.వివరాల్లోకి వెళితే… బెంగళూరు నగరంలోని సంజయ్‌నగర్ ప్రాంతంలో ఇస్కాన్ భగవద్గీత పోటీలు నిర్వహించింది.

భగవద్గీత పోటీల్లో సుభాష్ మెమోరియల్ ఇంగ్లీషు స్కూలుకు చెందిన 9వతరగతి విద్యార్థి షేక్ మొహియుద్దీన్ కు ప్రథమ బహుమతి లభించింది.

సుమారు 14 పాఠశాలలకు చెందిన 400 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో 41 ప్రశ్నలు అడిగారు.బాలాజీ లేఅవుట్ కు చెందిన సలాయుద్దీన్ కుమారుడైన షేక్ మొహియుద్దీన్ అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి అందరి నుంచి అభినందనలు అందుకున్నారు.తమ అమ్మమ్మ భగవద్గీత కొని ఇవ్వడంతో ఆరునెలల్లో పూర్తిగా చదివానని మొహియుద్దీన్ చెప్పారు.

తాను గతంలోనే ఖురాన్ చదివానని, భగవద్గీత చదివాక మానవ విలువలు అన్నింట్లోనూ ఒకటేనని గ్రహించానని చెప్పాడు.ప్రస్థుతం బైబిల్ కూడా చదువుతున్నానని షేక్ చెబుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube