ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడో స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం?

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు అన్ని అభిమానులకు తెలిసిపోతున్నాయి.ఒకప్పుడు సెలబ్రెటీలకు సంబంధించిన ఏవైనా ఫోటోలు చూడాలంటే కేవలం వార్తాపత్రికలలో మాత్రమే చూసే వాళ్ళం.

 Can You Find The Baby In This Photo Now She Is The Top Most Actress In Bollywood-TeluguStop.com

ఇలా పేపర్లలో వచ్చిన వారి ఫోటోలను ఎంతోమంది వారి అభిమానానికి గుర్తుగా వాటిని జాగ్రత్త పరిచేవారు.అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదిక వారి చిన్నప్పటి ఫోటోలను వారి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుత కాలంలో సినీతారలు వారి చిన్నప్పటి ఫోటోలను అభిమానులతో పంచుకోవడం ట్రెండ్ గా మారింది.ఈ క్రమంలోనే పై ఫోటోలో కనిపిస్తున్నటువంటి చిన్నారి ఎంతో ధైర్యంగా కళ్ళల్లో ఏమాత్రం భయం లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

అలా ఎంతో ధైర్యంగా ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.అయితే ఆ చిన్నారి ఎవరు గుర్తుపట్టారా.ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ ఆమె కళ్ళలో ఏ మాత్రం భయం లేదు.తనకు ఏది తోస్తే అది ముక్కుసూటితనం గా మాట్లాడుతూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆమె నైజం.

ఇవన్నీ విన్న తర్వాత అయినా ఆ హీరోయిన్ ను ఎవరో గుర్తుపట్టారా.అవును మీరు అనుకున్నది నిజమే ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి చిన్నారి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.

చిన్నపుడు కంగనా సోదరుడు పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫోటోను కంగనా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి తన అభిమానులు ఇతరులకు పజిల్ రూపంలో ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు.

ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ నిత్యం ఏదో ఒక వివాదాస్పద ట్వీట్ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తరువాత వీరి విడాకుల విషయం పై స్పందించిన కంగనారనౌత్ విడాకులు తీసుకోవడం వెనక అమీర్ ఖాన్ పాత్ర ఉంది అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube