అరటి పండ్లను ఆ సమయంలో మాత్రం తినకూడదు... ఒకవేళ తింటే చాలా ప్రమాదం  

మన ఆరోగ్యానికి సహాయపడే పండ్లను ఎప్పుడు తింటే ఏముందిలే అనుకుంటున్నారా? పండ్లను ఎప్పుడు తిన్నా మంచిదే. పండ్లను తినటానికి ఇది సరైన సమయం అని చెప్పలేం.

కానీ తినవలసిన సమయంలో తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాంటప్పుడు ఇప్పడు తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అప్పుడే తింటే మంచిది కదా.

సాధారణంగా ఫ్రూట్స్ ని ఉదయం సమయంలో తింటే చాలా మంచిది. ఎందుకంటే దాదాపుగా అన్ని ఫ్రూట్స్ లోను యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి ఉదయం సమయంలో అయితే చాలా తేలికగా జీర్ణం అవుతాయి.

రోజులో మిగతా సమయాలలో కన్నా ఉదయం సమయంలో జీర్ణ వ్యవస్థ చురుకుగా ఉంటుంది. అందువల్ల ఫ్రూట్స్ తీసుకోవటానికి ఉదయం సమయం మంచి సమయం.

చాలా ఫలాలను ఖాళీ కడుపుతో తీసుకుంటే మరీ మంచిది.


అయితే అరటి పండ్లను మాత్రం పరగడుపున అసలు తినకూడదు. ఎందుకంటే రాత్రి సమయంలో పడుకొని ఉదయం లేచేసరికి కడుపు ఖాళీగా ఉంటుంది.

అందువల్ల ఉదయం సమయంలో మన రక్తంలోని చక్కెర స్థాయులు కొద్దిగా తక్కువగా ఉంటాయి. అయితే అధిక చక్కెర స్థాయులుండే అరటిపళ్లను పరగడుపునే తినడం వల్ల రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ ఒక్కసారిగా పెరిగిపోతాయి.

అది అంత మంచిది కాదు. అలాగే చాలా మంది భోజనం ముగించిన వెంటనే ఏదో ఒక పండును తింటుంటారు. అదీ మంచిది కాదట. జీర్ణం కావడంలో కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. .

అంతగా తినాలనుకుంటే భోజనం పూర్తయిన గంట తిర్వాత తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు.
చూసారుగా ఫ్రెండ్స్ అరటిపండు ను మాత్రం ఉదయం పరగడుపున తినకుండా జాగ్రత్తగా ఉండండి.