అవును, వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది నిజమే.వైన్ ( Wine )అనేది ఎంత పాతబడితే అంత విలువ దానికి.
పాత మద్యం రుచికి మత్తెక్కిపోయేవారు ఇక్కడ ఎంతోమంది వున్నారు.దీంతో మద్యం ప్రియులు పాత మద్యం ఎక్కడ దొరుకుతుందాని పసిగడుతూ వుంటారు.
కాబట్టి దీని ధర మార్కెట్లో చాలా ఎక్కువగా పలుకుతుంది.సదరు మద్యాన్ని బట్టి ఒక్కోసారి దిమ్మతిరిగే ధర పలుకుతూ ఉంటుంది.
ఇదే ఆలోచన ఓ వ్యక్తిని లక్షాధికారిని చేసిందంటే మీరు నమ్ముతారా? అతని వద్ద వున్నది కేవలం 1 మద్యం సీసానే.అయితేనేం అదే మద్యం సీసా అతగాడిని లక్షాధికారిని చేసింది.

వివరాల్లోకి వెళితే, కాలిఫోర్నియాకి చెందిన మార్క్ పాల్సన్( Mark Paulson ) అనే వ్యక్తి 1970 నుండి “డొమైన్ డి లా రోమనీ-కాంటి లా టాచే”( Domaine de la Romanie-Conti la Tache ) అనే మద్యం బాటిల్‌ను దశాబ్దాలుగా నేలమాళిగలో కార్డ్‌బోర్డ్ పెట్టెలో పెట్టి దాచి ఉంచాడు.అప్పట్లో పాల్సన్ దానిని కేవలం 250 డాలర్లు అంటే ఈరోజు 20 వేల రూపాయలు పెట్టి కొన్నాడు.దీని ప్రకారం, దీని ధర ఇప్పటికి మహాకాకపోతే $1,889 ఉండాలి.కానీ పాతది కావడంతో వేలంలో అది ఏకంగా $106,250 కంటే ఎక్కువ ధరకు విక్రయించబడింది.అంటే, ఈ వ్యక్తి కేవలం ఒక మద్యం బాటిల్ తో మన ఇండియన్ కరెన్సీలో రూ.87,91,815.63 సంపాదించుకోగలిగాడన్నమాట.

అనుకున్న ధర కంటే రెట్టింపు ధర రావడంతో మనోడి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.వేలం సంస్థ బోన్‌హామ్ స్కిన్నర్ ప్రకారం, ఆ వ్యక్తి మార్చిలో తను ఇప్పటి వరకు ఓపెన్ చేయని 50 ఏళ్ల వైన్ బాటిల్ తన వద్ద ఉందని చెప్పగా ఈసారి ఆ బాటిల్‌ని వేలం వేయాలని నిర్ణయించుకున్నట్టుగా వారు తెలిపారు.సదరు బాటిల్ $50,000-$80,000 మధ్య అమ్ముడవుతుందని వారు అంచనా వేయగా అది రికార్డు స్థాయిలో $106,250కి విక్రయించబడింది.
ఇది చాలా అరుదైన వైన్ అని, ప్రపంచ వ్యాప్తంగా ఈ రకమైన వైన్ 1300 సీసాలు మాత్రమే ఉన్నట్టుగా ఈ సందర్భంగా వెల్లడించారు.
