శివ లింగాన్ని ఇంటిలో ఉంచి పూజ చేయవచ్చా?  

Can We Keep Shiva Lingam Home..? -

సాధారణంగా చాలా మంది ఇంటిలో శివ లింగం ఇంటిలో ఉండకూడదని అంటూ ఉంటారు.ఆలా ఇంటిలో ఉంచుకుంటే అరిష్టం జరుగుతుందని చాలా మంది భావిస్తారు.అయితే శివ లింగాన్ని ఇంటిలో ఉంచుకోవటంలో ఎలాంటి అరిష్టం జరగదు.ఇంటిలో అలంకరణ కోసం పెట్టుకునే ప్రతిమలకు ఆరాధనలు, నైవేద్యాలు చేయవలసిన అవసరం లేదు.

Can We Keep Shiva Lingam Home..?

అయితే ఒక్కసారి శివ లింగానికి పూజ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలోను పక్కన పెట్టకూడదు.పూజ చేయవలసిందే.

ఎందుకంటే ఒక్క సరి పూజ చేస్తే ఆ శివ లింగంలోకి భగవంతుని శక్తి ఆవాహన జరుగుతుంది.అందువల్ల ఆ శక్తివంతమైన శివ లింగానికి ప్రతి రోజు పూజ చేయవలసిందే.

శివ లింగాన్ని ఇంటిలో ఉంచి పూజ చేయవచ్చా-Telugu Bhakthi-Telugu Tollywood Photo Image

ప్రతి రోజు చేసే పూజలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి.శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ప్రతి రోజు శక్తి కొలది తప్పనిసరిగా అభిషేకం చేయాలి.అభిషేకం అంటే శివ పంచాక్షరి (ఓం నమశ్శివాయ) చదువుతూ అభిషేకం చేయవచ్చు.శ్రద్ధగా శివపూజ చేయగలిగిన వారు ఇంటిలో శివలింగాన్ని నెలకొల్పి పూజించవచ్చు.ముందుగా దీపారాధన చేసుకోవాలి.కలశంలోని నీటిని గంగా గంగా గంగ అని అభిమంత్రించాలి.

తరువాత ‘‘శ్రీ గంగా సహిత ఉమా మహేశ్వరాభ్యాం నమః ధ్యానం సమర్పయామి’’ అని అక్షితలు వేయాలి.లింగాన్ని పళ్ళెంలో పెట్టి స్నానం / అభిషేకం చేసి, అభిషేకం అయ్యాక స్వామిని శుభ్రంగా తుడిచి మందిరంలో పెట్టి ఉంచితే సరిపోతుంది.

అయితే కాస్త నిష్ఠతో చేయాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Can We Keep Shiva Lingam Home..?- తెలుగు భక్తి కళ ఆద్యాధమిక ప్రసిద్ధ గోపురం పండగలు పూర్తి విశేషాలు - Telugu Related Details Posts....

TELUGU BHAKTHI