పక్కవారి పువ్వులతో పూజ చేయవచ్చా... చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

Can We Do Pooja With Flowers Of Other House Owners

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం హిందువులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడికి పూజ చేయడం ఒక సాంప్రదాయంగా భావిస్తారు.ఈ క్రమంలోనే వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి పూజలు చేస్తుంటారు.

 Can We Do Pooja With Flowers Of Other House Owners-TeluguStop.com

అయితే కొందరు ఆర్థిక పరిస్థితులను బట్టి రోజు స్వామివారికి పువ్వులు కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది.కనుక వారికి ఇష్టమైన రోజున స్వామివారికి ప్రత్యేక పుష్పాలతో అలంకరించి పూజలు చేస్తుంటారు.

అయితే మరి కొందరు ఇంటి ఆవరణంలో పూల మొక్కలను పెంచుకొని ఆ పుష్పాలతో స్వామివారికి పూజ చేస్తారు.

 Can We Do Pooja With Flowers Of Other House Owners-పక్కవారి పువ్వులతో పూజ చేయవచ్చా… చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మన ఇరుగుపొరుగు వారు స్వామి వారికి పూజలు చేయడానికి పువ్వుల కోసం మన పెరటిలో కాకుండా ఇతరుల పెరట్లో ఉన్న మొక్కల నుంచి పువ్వులను కోస్తూ పూజ చేస్తుంటారు.

ఇలా పూజ చేయడం మంచిదేనా?ఇలా పూజలు చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటూ పలువురు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తుంటారు.ఈ క్రమంలోనే ఇతరుల పుష్పాలతో పూజలు చేస్తే ఏం జరుగుతుందో అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా స్వామివారికి పూజలు చేసే సమయంలో ఏదైనా ఒక పుష్పం ఫలం సమర్పించడంవల్ల స్వామి వారు ఎంతో ప్రీతి చెందుతారని భావిస్తారు.ఈ క్రమంలోనే పక్కవారి పెరట్లో ఉన్నటువంటి పువ్వులను కోసి దేవుడికి పూజ చేస్తాము.

అయితే ఇలా చేయటం వల్ల మనకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందని భావిస్తాము.నిజానికి పక్కవారి చెట్లులో ఉన్నటువంటి పుష్పాలను కోసి పూజ చేయటం వల్ల మనం చేసే పూజ లో సగం పుణ్యం మనం ఇతరుల చెట్టులో పువ్వులు కోయడం వల్ల ఆ పుణ్యం వారికి చెందుతుందని పండితులు చెబుతున్నారు.

అందుకోసమే పూజకు మన పెరట్లో ఉన్నటువంటి పుష్పాలను మాత్రమే తీసుకోవాలని అప్పుడే పూర్తి పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

#Flowers Pooja #Pooja #Flowers #Owners

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube