బాహుబలి 2 రికార్డును పఠాన్ బ్రేక్ చేయబోతుందా?

Can Shah Rukh Khans Pathaan Break Bahubali 2's Record, Bahubali 2, Bahubali 2 Record, Pathaan Movie, Shah Rukh Khan, Deepika Padukone, Sharukh Khan Pathaan Movie, Director Siddharth Anand, Bollywood,

బాలీవుడ్ లో కింగ్ ఖాన్ గా పేరు తెచ్చుకుని స్టార్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు షారుఖ్ ఖాన్.అయితే షారుఖ్ ఖాన్ ఇది వరకులా బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకోలేక పోతున్నాడు.ఈయన చివరిగా జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కానీ ఈ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడమే కాకుండా ఈయనను జీరో సినిమాతో పెద్ద జీరో అయ్యాడు అని ట్రోల్ చేసారు.

 Can Shah Rukh Khans Pathaan Break Bahubali 2's Record, Bahubali 2, Bahubali 2 Re-TeluguStop.com

మరి ఇలాంటి అట్టర్ ప్లాప్ సినిమా తర్వాత నాలుగేళ్ళ గ్యాప్ ఇచ్చి మరీ ఇప్పుడు ”పఠాన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషల్లో కూడా భారీగా రిలీజ్ కాబోతుంది.గత కొన్ని రోజులుగా బాలీవుడ్ లో ఒక్క హిట్ కూడా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాతో అయినా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందో లేదో అని ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

Telugu Bahubali, Bollywood, Shahrukh, Siddharth Anand, Pathaan, Shah Rukh Khan,

మరి అందరూ కోరుకుంటున్న విధంగానే ఈ సినిమా ప్రమోషన్స్ తోనే భారీ హైప్ అయితే తెచ్చుకుంది.ఇప్పటికే ఈ సినిమా ఎన్నో రికార్డులను సైత క్రియేట్ చేస్తూ వస్తుంది.అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఎప్పుడు ఏ సినిమాకు లేని విధంగా జరుగుతున్నాయి.ఇప్పటి వరకు ఇండియాలోనే ఎప్పుడు లేని విధంగా 4.20 లక్షలకు పైగా అమ్ముడు అయ్యాయి.

Telugu Bahubali, Bollywood, Shahrukh, Siddharth Anand, Pathaan, Shah Rukh Khan,

ఇండియాలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక ప్రీ సేల్స్ సాధించిన చిత్రంగా పఠాన్ కెజిఎఫ్ 2 (5.15) ఇంకా బాహుబలి 2 (6.50) లక్షలు సృష్టించిన రికార్డులను సైతం దాటుతుంది అని అనుకుంటున్నారు.మరి బాహుబలి 2 రికార్డ్ దాటాలంటే ఇంకా 2 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడు అవ్వాలి.మరి పఠాన్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube