పవన్ కళ్యాణ్ కలలు అసలు కార్యరూపం దాల్చుతాయా?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.ఒకపక్క వరుసగా సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలపై దృష్టి సారించడం అంటే మామూలు విషయం కాదు.

 Can Pawan Kalyan Achieve His Dreams , Pawan Kalyan, Janasena Activists, Nara Lok-TeluguStop.com

అయితే పవన్ అవసరమైనంత సమయం ప్రజలకు కేటాయిస్తున్నాడా లేదా అన్న విషయం కొద్దిసేపు పక్కన పెడదాం.ఒంటరిగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కావడం అనేది దాదాపుగా అసాధ్యమైన పని.బాగా గట్టిగా ప్రయత్నిస్తే ప్రధాన ప్రతిపక్షంగా మారే అవకాశాలు ఉన్నాయి.కానీ అది ఏమీ అంత సులభం కాదు.

ఇలాంటి సమయంలో టిడిపి తో పొత్తు పెట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి… ఇది అందరికీ తెలిసిందే.

Telugu Jagan, Janasena, Lokesh, Pawan Kalyan, Ysrcp, Yuvagalam-Politics

అయితే టిడిపి తో పొత్తు వల్ల చాలామంది జనసేన కార్యకర్తలు సంతృప్తిగా లేరు.వారికి లోపల రాజకీయ వ్యూహాలు వాటికోసం జరగవలసిన కాంప్రమైజ్ లు అర్థమయ్యేలాగా చెప్పాల్సిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అసలు ఆ టాపిక్ తీసుకొని రాకపోవడం గమమార్గం.జనసైనికుల యువరక్తం మాత్రం చంద్రబాబుతో కలిసేదే లేదు అని అంటున్నారు.

ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ జనాల్లోకి తిరగాల్సి ఉంది.నారా లోకేష్ ‘యువగళం’ ద్వారా తన వంతు ప్రయత్నం టిడిపికి చేస్తున్నాడు.

మరొకవైపు కళ్యాణ్ వారాహి పూజ అయిపోయినప్పటికీ అదే హీట్ లో ప్రజల్లోకి వెళ్లలేకపోయాడు.ఇలాంటి చిన్న చిన్న తప్పులే పవన్ కళ్యాణ్ కు ఉన్న పేరు, ఫాలోయింగ్ ను ఓటర్ దగ్గరికి వచ్చేటప్పటికి నిర్వీర్యం చేస్తోంది.

Telugu Jagan, Janasena, Lokesh, Pawan Kalyan, Ysrcp, Yuvagalam-Politics

ఇక ప్రసంగాల్లో పవన్ కళ్యాణ్ మాటల్లో స్పష్టత ఉంటుంది.అతను ఎలాంటి ప్రభుత్వం తీసుకుని రావాలి అనుకుంటున్నాడు అన్నది ఎంతో కూలంకూషంగా చెబుతాడు.అయితే సినీ గ్లామర్ మాత్రం అందుకు జతపడదు అనే విమర్శ ఉంది.ఇక తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే జనసేన కనీసం 50 సీట్లు అయినా పొత్తులో భాగంగా ఆశిస్తుందా అన్న గ్యారెంటీ లేదు.

సొంతంగా 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు కాండిడేట్లు ఉన్నారా లేదా అన్నది కూడా డౌటే.ఒకవేళ జనసేన-టిడిపి కూటమి విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్ కు సీఎం కుర్చీలో సగం ఇస్తారా అంటే అది కూడా డౌటే.

ఇన్ని అనుమానాలు మధ్య పవన్ ప్రజల్లోకి ఒక స్పష్టత ఎంత త్వరగా తీసుకొస్తే అతని రాజకీయ భవిష్యత్తుకు అంత మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube