పెళ్లి కానీ అమ్మాయిలు శివలింగాన్ని పూజించవచ్చా?

మన హిందూ సంప్రదాయంలో పూజించే దేవుళ్లలో పరమ శివుడు కూడా ఒకరు.శివ భక్తులు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి ప్రదక్షిణాలు చేసి అభిషేకం చేయటం మరియు దర్శనం చేసుకోవటం సర్వ సాధారణమే.

 Can Married But Girls Worship Shivalinga , Shivalinga, Girls , Worship-TeluguStop.com

శివుడు అభిషేక ప్రియుడు అన్న సంగతి మనకు తెలిసిందే.అలాగే ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు.

సాధారణంగా దేవతలు మరియు దేవుళ్ళు విగ్రహాల రూపంలో ఉంటే పరమ శివుడు మాత్రం లింగ రూపంలో ఉంటారు.ఏ శివాలయానికి వెళ్లిన శివుడు లింగ రూపంలోనే దర్శనమిస్తారు.

శివలింగం మూడు భాగాలుగా ఉంటుంది.కింది భాగం బ్ర‌హ్మ దేవుని రూపంగా, మ‌ధ్యభాగం విష్ణు రూపంగా, పై భాగం శివ‌రూపంగా భావిస్తారు.ఇక లింగం కింద ఉండే భాగాన్ని యోని అంటారు.ఈ విషయం చాలా మందికి తెలియదు లింగం-యోనిల సంగ‌మ‌మైన శివ‌లింగం విశ్వానికి ప్ర‌తీక అని భావిస్తారు.

స‌మ‌స్త విశ్వం అందులో ఉంటుందని నమ్మకం.అనంత‌మైన ఐక్య‌త‌కు, జీవోద్భావ‌న‌కు అది సూచిక అని అంటారు.

అదేవిధంగా శివ‌లింగంలో ఉండే లింగం, యోని భాగాలు మానవ ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ అవ‌య‌వాల‌ను సూచిస్తాయి.

లింగం గురించి పురాణాల్లో చాలా అర్ధాలను చెప్పారు.

లింగం అంటే స్థిర‌మైంద‌ని, దృఢ‌మైంద‌ని,నాశనం లేదని చెప్పారు.ఇవన్నీ కలిస్తేనే లింగం అవుతుంది.

లింగాన్ని పూజిస్తే అనంతమైన శక్తి లభిస్తుంది.అయితే పెళ్లి కానీ యువతులు శివలింగాన్ని పూజించకూడదు.

వారు పార్వ‌తీ దేవితో క‌ల‌సి ఉన్న శివున్ని పూజించ‌వ‌చ్చ‌ట‌.దీంతో వారికి మంచి భ‌ర్త దొరుకుతాడ‌ట‌.

ఇక వారు 16 సోమ‌వారాల పాటు ఉప‌వాసం ఉండి శివారాధ‌న చేస్తే చాలా మంచి జరుగుతుందని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube