ఆర్ధిక మాంద్యాన్ని భారత్ అధిగమించగలదా?

ప్రపంచాన్ని గడ గడ లాడించిన కోవిడ్ మహమ్మారి గండం నుంచి తప్పించుకునేందుకు ప్రపంచం లోని వివిధ దేశాల ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్యాకేజీలు ప్రకతించిన సంగతి మనందరికీ విదితమే.ఫలితంగా ఈ విపత్తు నుండి బయటపడి ఊపిరి తీసుకుంటున్న సమయాన రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

 Can India Overcome Economic Recession , Economic Recession, India , Russia-ukra-TeluguStop.com

ఈ రెండింటి కారణంగా సరఫరా గొలుసులో అవాంతరాలు సంభవించి.ఆహార ధాన్యాలు మరియు, చమురు ధరలు విజృంభించాయి.

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం విజృంభించింది.దీనివలన ప్రజల ఆదాయాలు గణనీయంగా పడి పోవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి మందగించిందని విభిన్న నివేదికలు చెబుతున్నాయి.2022 మొదటి భాగంలో చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం అత్యంత గరిష్ట స్థాయికి చేరుకుంది.1980 నుంచి ఇంత ద్రవ్యోల్బణం భారీగా పెరగడం ఇప్పుడేనని ఎకనమిక్ అవుట్ లుక్ నివేదిక పేర్కొనడాన్ని బట్టి ధరల పెరుగుదల తీవ్రత మనకు తెలిసింది.ఈ నేపధ్యంలో దీనిని కట్టడి చేయడం కోసం అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచటం మొదలు పెట్టాయి.పరిస్ధితి చక్కబడుతుంది అనే సమయంలో మాంద్యం అనే ముప్పు మళ్లీ తెరపైకి వచ్చింది.2023 నాటికి ఈ మాంద్యం తీవ్రత పెరిగి ప్రపంచ దేశాలను చుట్టుముట్టునుందని ఆర్ధిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.ఈ మాంద్యం సామాన్యమైనది కాదని.

అత్యంత ప్రమాదకరంగా, దీర్ఘకాలంపాటు ఉండబోతున్నదని ప్రముఖ ఆర్థికవేత్త, రోబిని పేర్కొన్నారు.అమెరికాలో ఈ ఏడాది చివరికల్లా ప్రారంభమయ్యే ఈ ఆర్థిక ఉత్పాతం వచ్చే 2023 సంవత్సరాంతం వరకు ప్రపంచ దేశాలను తీవ్రంగా కుదిపేస్తుందని రోబిని హెచ్చరించారు.

ప్రస్తుత ఆర్థిక సంక్షోభ సమయంలో రోబిని చేసిన ఈ హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన మొదలయ్యింది.

ఇంత‌కుముందు ఆర్థిక మాంద్యాల కంటే శరవేగంగా పడిపోతున్న ప్రస్తుత ప్రపంచ వృద్థి రేటు మున్ముందు కూడా ఇలాగే కొనసాగితే ప్రపంచంలో అత్యధిక దేశాలు మాంద్యంలో కూరుకు పోవడం తో పాటు వినియోగ‌దారుల విశ్వాసాన్ని కోల్పోవడం ఖాయం అనే హెచ్చరికలు కూడా వస్తున్నాయి.అయితే భారత్ మాత్రం గత మాంద్య ప్రభావాన్ని అధిగమించినట్లే ఇప్పుడు కూడా మాంద్య ప్రభావానికి దీటుగా నిలబడగలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భారత్ పై మాంద్యం ప్రభావం.

ఒక వైపు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థికవేత్తలు మరియు ప్రపంచ బ్యాంక్ ఈ మాంద్యం ముప్పు ప్రపంచం అంతటా విస్తరిస్తోంది అని చెబుతూ ఉంటే భారత్ కు మాత్రం డోకా లేదని మాంద్యం మనల్ని ఏమీ చేయలేదనే గత అనుభవాలు రీత్యా చూస్తే ఇది స్పష్టం అవుతుందని వాదించే వాళ్ళు లేకపోలేదు.దాని ప్రకారం చూస్తే2008 లో కూడా భారత్ మాంద్యం ప్రభావానికి భారత్ గురయ్యింది.

అయితే అది తీవ్రమైన ప్రభావం చూపలేదనే చెప్పవచ్చు.దాని ప్రతికూలతలను అనతి కాలంలోనే సరిదిద్దుకోవడానికి ఆనాటి పరిస్ధితులు అనుకూలించాయి.

మాంద్యం ప్రభావం అన్ని దేశాలపై పడుతూ ఉండగా భారత్ పై దాని ప్రభావం తక్కువ ఉంటుంది అని విశ్లేషకులు చెప్పడానికి గల కారణాలు పరిశీలిస్తే భారత్ అనేది చైనా శ్రీలంకల వలే ఎక్కువుగా ఎగుమతుల మార్కెట్ పై ఆధారపడిన దేశం కాదు.దేశీయ మార్కెట్ పైనే ఎక్కువ ఆధారపడి ఉంది.

ఈ సమయంలో మాంద్యం కారణంగా క్షీణించినా దాని వలన మన వ్యవస్ధపై పెద్ద హాని కలుగక పోవచ్చు అనేది నిపుణుల అభిప్రాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube