గర్భసంచి లేకుండా పిల్లలు పుడతారా? నిజమేమిటంటే?

ఆడవారిలో ప్రత్యుత్పత్తి జరగాలంటే గర్భాశయం నుంచి అండాలు విడుదల అవడం వల్ల ప్రత్యుత్పత్తి జరుగుతుంది.అలాంటిది గర్భాశయం లేకున్నా పిల్లలు కలుగుతారా అన్న సందేహం కొంతమందికి కలుగుతుంది.

 Is It Possible To Get Pregnant Without A Uterus?, Pregnant Without A Uterus , Ut-TeluguStop.com

అలాంటి సందేహాలు రావడం నిజమే! కానీ కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల, లేదా జన్యు లోపాల వల్ల పుట్టుకతోనే వారిలో గర్భాశయం ఏర్పడదు.అలాంటి వారిలో అండాశయం నుంచి అండాలు విడుదల చేసే ఈస్ట్రోజెన్ హార్మోన్ వల్ల వీరిలో అమ్మాయి లక్షణాలు ఉంటాయి.

కానీ గర్భాశయం ఉండక పోవడం వల్ల నెలసరి రావు.

గర్భాశయం లేకపోయినా అందరి అమ్మాయిలలో లాగే వీరికి అమ్మాయిల లక్షణాలు ఉంటాయి.

కాకపోతే గర్భాశయం లేకపోవడం వల్ల వారికి సంతానం కలగదు.ఇలాంటి వారు పిల్లలు కావాలనుకుంటే, అండాశయంలో అండాలు విడుదల అవడం వల్ల ఆ అండాలను తీసుకుని సరోగసి ద్వారా పిల్లల్ని కనవచ్చు.

అయితే ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని.

ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలలో ఎంతో సాంకేతికతను ఉపయోగించి.ఒకరి గర్భాశయాన్ని తీసి మరొకరికి అమర్చడం జరుగుతుంది.దీన్నే యుటిరైన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ అని కూడా అంటారు.ఇలాంటి ట్రాన్స్ ప్లాంట్ ను మన దేశంలో కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి.కానీ ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అన్న విషయం మాత్రం తెలియడం లేదు.

ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అయినా వారికి నెలసరి క్రమంగా రావడం, పిల్లలు పుడతార అన్నది కచ్చితంగా చెప్పలేరు.ఈ ట్రాన్స్ ప్లాంట్ ఎంతో ఖర్చుతో కూడుకున్న పని.
చాలా తక్కువ మందిలో ఈ సమస్య తలెత్తుతుంది.ఇది వంశపారంపర్యంగా వస్తున్న జన్యు లోపాల కారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి.

లేదా కొన్ని తరాల నుంచి మేనరిక వివాహాలు చేసుకోవడం ద్వారా అలాంటి వారిలో ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. గర్భాశయం లేని వారికి సంతానం కలుగుతుంది అనడం కేవలం అపోహ మాత్రమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube