మహిళల వీపు పై కాలితో తొక్కితే పిల్లలు పుడతారా..?! అక్కడ మాత్రం..!

రోజు రోజుకి మానవుని పురోగతి భూమిని దాటి అంతరిక్షం వైపు పయనిస్తూ ఉంది.కేవలం కొన్ని గంటల్లో భూమండలాన్నీ మొత్తం చుట్టివచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కనిపెట్టాడు.

 Can Children Be Born If A Woman Steps On Her Lap Going There, Pregnancy, Baba, A-TeluguStop.com

ఇవన్నీ ఒక వైపు ఉంటే మరోవైపు ప్రజలు మాత్రం మూఢనమ్మకాలు అంటూ ఇంకా పాత పద్ధతిలోనే నడిచేవారు కూడా లేకపోలేదు.ముఖ్యంగా అభివృద్ధి చెందని దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మే వారు ఎక్కువ అని చెప్పవచ్చు.

ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలలో గిరిజన ప్రాబల్య ప్రాంతాలలో ఎక్కువగా ఈ మూఢ నమ్మకాలు నమ్ముతుంటారు.ప్రస్తుతమున్న టెక్నాలజీ యుగంలో కూడా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి అంటే వారు ఎంతలా వెనుకబడి పోయారో అర్థం అవుతుంది.

ఇకపోతే కొందరిది మూఢనమ్మకం అనుకోవాలో లేకపోతే సంతానం కలుగలేదని బాధపడే వారు అని బాధ పడాలో తెలియదు కానీ ఓ వింత ఆచారం మాత్రం వెలుగులోకి వచ్చింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ధంతరి జిల్లాలో మాత్రం అక్కడ ఉన్న పూజారుల చేత శరీరంపై తొక్కించుకుంటే వారికి పిల్లలు పుడతారు నమ్మకం మాత్రం ఆ ప్రాంత ప్రజల్లో బలంగా పాతుకుపోయింది.ఎక్కడి నుంచో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినవారు కూడా సంతానం లేనివారు వందలాది మహిళలు ఒకరి పక్కన ఒకరు బోర్లా పడుకొని ఉండగా అక్కడ ఉన్న పూజారులు, మంత్రగాళ్లు వారిని వెతుక్కుంటూ వెళ్ళిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో జరిగే మధాయి జాతరకు ప్రతి సంవత్సరం వేలాది మంది వస్తూ ఉంటారు.

అంగామోతి ఆలయంలో ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుపుతారు.

అక్కడి పూజారులు మహిళల పై తొక్కితే పిల్లలు పుడతారు అని వారి నమ్మకం.ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఓ వైపు కరోనా ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకున్నారు.

సామాజిక దూరం మాస్కులు ధరించడం లాంటి వాటిని పక్కన పెట్టేసి ప్రజలు ఈ జాతరలో పాల్గొన్నారు.అయితే ప్రజలకు ఉన్న మూఢ నమ్మకాలపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని చూసిన ఛత్తీస్ఘడ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ కిరణ్మయి నాయక్ ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడున్న మహిళతో మాట్లాడి వారి మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube