సెలబ్రేటిలు ఎన్టీఆర్ షోలో రూ.25 లక్షలు కంటే ఎక్కువ గెలవలేరా.. అంతకుమించి తెలివి ఎవరికి లేదా?

Can Celebrities Win More Than Rs 25 Lakh On Ntr Show

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉంటాయి.ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న వాటిలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం ఒకటి.

 Can Celebrities Win More Than Rs 25 Lakh On Ntr Show-TeluguStop.com

ఈ కార్యక్రమం స్టార్ మాలో ప్రసారం అవుతూ చిరంజీవి నాగార్జున వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.ఇకపోతే ఈ షోలో కొద్దిగా మార్పులు చేసి దీనిని జెమినీ టీవీ వాళ్లు ప్రసారం చేశారు.

ఈ కార్యక్రమానికి ఎవరు మీలో కోటీశ్వరులు అనే పేరుతో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బుల్లితెరపై కి వచ్చారు.ఇదివరకే ఎన్టీఆర్ బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు.

 Can Celebrities Win More Than Rs 25 Lakh On Ntr Show-సెలబ్రేటిలు ఎన్టీఆర్ షోలో రూ.25 లక్షలు కంటే ఎక్కువ గెలవలేరా.. అంతకుమించి తెలివి ఎవరికి లేదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమం ద్వారా మరోసారి బుల్లితెరపై ప్రేక్షకులను మెప్పించారు.సాధారణంగా ఏ కార్యక్రమం ప్రసారమైన ఆ కార్యక్రమానికి అప్పుడప్పుడు సెలబ్రిటీలు వస్తూ ప్రేక్షకుల ను సందడి చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమానికి కూడా పలువురు సినీ సెలబ్రిటీలు వచ్చి తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇక ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హాజరయ్యారు.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా ఆడుతూ ఎన్నో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ప్రేక్షకులను సందడి చేశారు.ఈ ఆటలో భాగంగా రామ్ చరణ్ 25 లక్షలు గెలుచుకున్నారు.

Telugu Lakhs, Jr Ntr, Meeloevaru, Show-Movie

రామ్ చరణ్ అనంతరం డైరెక్టర్స్ కొరటాల శివ, రాజమౌళి వీరిద్దరూ కలిసి ఒకేరోజు ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు.ఎన్టీఆర్ కి ఇద్దరు దర్శకులతో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో విషయాలను ముచ్చటించారు.అలాగే వీరు కూడా ఈ కార్యక్రమంలో 25 లక్షలు గెలుచుకున్నారు.ఇకపోతే విడాకులు ప్రకటన తర్వాత సమంత మొట్టమొదటిగా పాల్గొన్న కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు.విడాకులు ప్రకటన తర్వాత మొదటిగా ఈ కార్యక్రమానికి రావడంతో ఈ ఎపిసోడ్ భారీ రేటింగ్స్ ను దక్కించుకుంది.ఇక సమంత కూడా ఈ కార్యక్రమంలో 25 లక్షలు గెలుచుకుంది.

Telugu Lakhs, Jr Ntr, Meeloevaru, Show-Movie

ఈ కార్యక్రమంలో చివరి ఎపిసోడ్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు.మహేష్ బాబు ఎన్నో సినిమా విషయాలను మాట్లాడుతూ ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా మహేష్ బాబు తన కుటుంబ విషయాలను తన కూతురి విషయాలను పంచుకున్నారు.చివరి ఎపిసోడ్ లో భాగంగా మహేష్ బాబు కూడా 25 లక్షల రూపాయలను గెలుచుకున్నారు.

ఇలా ఈ కార్యక్రమానికి వచ్చిన సెలబ్రిటీలు అందరూ కూడా 25 లక్షలు గెలుచుకోవడం ఏమిటి అనే విషయం అందరిని ఆలోచనలకు గురిచేస్తోంది.వీరందరూ 25 లక్షలు మాత్రమే గెలుచుకోవడంతో ముందుగానే వీరికి ఈ కార్యక్రమం గురించి స్క్రిప్ట్ తెలియజేశారనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ముందుగా వారికి సమాచారం ఇవ్వడంతో సెలబ్రిటీలు మొత్తం 25 లక్షల వరకు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే పలువురు నెటిజనులు స్పందిస్తూ అంత పెద్ద సెలబ్రిటీలు కూడా కేవలం 25 లక్షలు గెలుచుకునేంత తెలివి మాత్రమే ఉందా అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఏది ఏమైనా సెలబ్రిటీలు మొత్తం ఇలా ఒకటే మొత్తంలో డబ్బులు గెలుచుకోవడంతో ఈ కార్యక్రమం వెనుక ఎలాంటి రహస్యం ఉందో అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

#MeeloEvaru #Jr NTR #Lakhs #Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube