కర్పూరంలో దాగి ఉన్న అద్భుతమైన సౌందర్య రహస్యాలు  

Camphor Beauty Benefits-

కర్పూరం అనేది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గపదార్థము. కర్పూరాన్ని ఎక్కువగా హారతి ఇవ్వటానికి ఉపయోగిస్తాం. ఏమైనపూజలు జరిగినప్పుడు పూజ పూర్తి అయ్యాక కర్పూరంతో హారతి ఇవ్వటం సహజమేఅయితే కర్పూరంలో ఎన్నో సౌందర్య రహస్యాలు దాగి ఉన్నాయి..

కర్పూరంలో దాగి ఉన్న అద్భుతమైన సౌందర్య రహస్యాలు-Camphor Beauty Benefits

వీటి గురించి చాలమందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కొద్దిగా కర్పూరాన్ని నూనెలో వేసి గోరువెచ్చగా చేసి దురద ఉన్న ప్రదేశంలరాసి సున్నితంగా మసాజ్ చేసి రాత్రంతా ఆలా వదిలేసి మరుసటి ఉదయం శుభ్రచేసుకోవాలి.

ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే దురద క్రమంగా తగ్గిపోతుంది.

కొన్ని తులసి ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో కొన్ని చుక్కకర్పూరం నూనెను వేసి బాగా కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరిన తర్వాముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే మొటిమలు,మొటిమమచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.

కొంచెం కర్పూరం ఆయిల్ తీసుకుని, అంతే మోతాదులో కొబ్బరి నూనెను తీసుకోనరెండింటిని మిక్స్ చేయాలి..

ఈ రెండూ వేడి చేసి తలకు రాసి వేడి నీటిలో డిపచేసి టవల్ ను తలకు చుట్టాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగచేయటం వలన తలలో పొడితనం,దురద తగ్గిపోతాయి.

చుండ్రును తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో యాంటబ్యాక్టీరియల్,యాంటీ ఇన్ఫలమేటరి లక్షణాలు ఉండుట వలన చుండ్రునసమర్ధవంతంగా తగ్గిస్తుంది. కర్పూరం నూనెను షాంపు మరియు కండీషనర్ లో కలిపఉపయోగించుకోవచ్చు.