అమెరికాలో ఎయిర్ పార్క్....ఇంటికో విమానమట..!!

సహజంగా మనం కార్, బైక్ పార్కింగ్ ల గురించి విన్నాం కానీ ఇప్పటి వరకూ ఎయిర్ పార్కింగ్ గురించి పెద్దగా వినలేదు.కానీ తాజాగా ఎయిర్ పార్కింగ్ అనే అంశం తెరపైకి వచ్చి అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.

 Cameron Aero Parks In America,aero Parks,america, Every House Has Aeroplane, Air-TeluguStop.com

ఇంతకీ ఏంటా ఎయిర్ పార్కింగ్, ఎక్కడ ఉంది అనే వివరాలలోకి వెళ్తే.

ఇళ్ళ ముందు బండ్లు , కార్లు పార్కింగ్ కోసం ఎలాగైతే పార్కింగ్ ఉంచుతామో అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ ప్రాంతంలో ఇళ్ళ ముందు విమానాలు పార్కింగ్ చేసి ఉంటాయి.

ఇక్కడ ప్రతీ ఇంటికి కారు విమానా పార్కింగ్ ఉంటుంది.అందుకు తగ్గట్టుగానే ఇళ్ళు నిర్మిస్తారు కూడా.

మనం కారు వేసుకుని బయటకు వెళ్ళినంత సులభంగా వాళ్ళు విమానాలు వేసుకుని వెళ్తారు.ఇలాంటి కమ్యూనిటీ ఇళ్ళను ఎయిర్ పార్క్ లుగా పిలుస్తారు.ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువగా ఎయిర్ పార్క్ లు ఉన్నాయట అంతేకాదు , ఇలాంటి ఎయిర్ పార్క్ లు మొత్తంగా 650 ఉన్నాయట.అయితే వీటన్నిలో కంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో గల ఈ ఎయిర్ పార్క్ అత్యంత ఆకర్షణీయంగా, ఎంతో విలాసవంతంగా ఉంటుందట.

ఆ ఎయిర్ పార్క్ పేరు కామెరాన్ పార్క్ అంటారు.ఇప్పుడు మళ్ళీ వార్తలో ఈ పార్క్ నిలవడానికి కారణం ఏంటంటే.

ఇక్కడి పార్క్ లోని ఇళ్ళను తాజాగా అమ్మకానికి పెట్టారు.అసలు ఈ పార్క్ ఎలా నిర్మించబడిందని అంటే.గతంలో ఆ ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని భావించారు.కానీ ఇక్కడ అనేకరకాల ఇబ్బందులు ఎదురవడంతో ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు.

దాంతో దాదాపు 60 ఎకరాల భూమిలో ఎయిర్ పోర్ట్ చుట్టూ ఇళ్ళ నిర్మాణాలు చేపట్టారు.ఇక్కడ విమానాలు నడపటానికి ఏవియేషన్ అనుమతి కూడా ఉండంటతో పాటు , విమాన రన్ వే అలానే ఉండటంతో పైలెట్లు, విమానాలు నడిపే వారు ధనవంతులు , అందరూ ఇళ్ళు కొనుగోలు చేశారు.

దాంతో ఆ ప్రాంతంలో ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంచక్కా విమానాలు వేసుకుని ఫ్యామిలీ తో టూర్స్ వేస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube