180 కిలోల బరువైన అరుదైన చేప.. ఎక్కడో తెలుసా?

ఎండాకాలం రావడంతో చేపల ప్రేమికులు మత్స్యకారుల వైపు చూస్తున్నారు.చేపల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతుల మోముల్లో ఆనందంవెల్లివిరుస్తోంది.

 Cambodian Fishermen Catches Giant Stingray Fish Weighs 180 Kilos Details, 180 Kg-TeluguStop.com

ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఎగుమతులూ సంతృప్తిగా సాగుతున్నాయి.దీంతో చేపల రైతులు, ఎగుమతిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో భాగంగానే కొత్త కొత్త జాతులకు చెందిన చేపలు బయటపడుతున్నాయి.కొన్ని వేల చేపల జాతులకు నెలవైన ఆసియాలోని మెకాంగ్ నదిలో అంతరించిపోతున్న స్టింగ్రే జాతికి చెందిన చేప మత్స్యకారుడి వలకు చిక్కింది.

స్టింగ్‌రే జాతి చేపలు విభిన్నమైనవి.మామూలు చేపలు రెండుపక్కలా నొక్కినట్లుగా ఉంటాయి.ఉష్ణమండల ప్రాంతాలలో ఉండే సముద్ర జలాల్లో కాస్త లోతు తక్కువగా ఉండే చోట ఇవి నివసిస్తుంటాయి.దాదాపు 60 విభిన్నరకాలు స్టింగ్‌ రేలలో కనిపిస్తుంటాయి.వీటి పొడవు దాదాపు 6.5 అడుగులు.బరువు 350కిలోల వరకు ఉంటుంది.వీటికి గట్టి ఎముకలతో తయారైన అస్థిపంజరం ఉండదు.మెత్తటి మృదులాస్థితో తయారైన మెత్తటి ఎముకలు ఉంటాయి.అయితే.

కంబోడియా ఈశాన్య ప్రావిన్స్‌లోని నదీ జలాల్లో దొరికిన ఈ చేప.నాలుగు మీటర్ల పొడవు, 180 కిలోల బరువు ఉండటంతో కంబోడియన్ మత్స్యకారులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Telugu Kgs, Kilosstingray, Giantstingray, Mekong, Rare Fish, Latest-Latest News

కాగా ఈ స్టింగ్రే జెయింట్. ఆగ్నేయాసియాలోని అతిపెద్ద, అరుదైన చేపల జాతుల్లో ఒకటిగా గుర్తించబడింది.అయితే విషయం తెలిసి అక్కడికి చేరుకున్న అంతర్జాతీయ నిపుణుల బృందం.చేప పొడవు, బరువును కొలిచి తిరిగి నీటిలో విడిచిపెట్టారు.కాగా ఈ చేప గురించి నిపుణుల బృందంలోని పరిశోధకురాలు ఎలిజబెత్ ఎవరెస్ట్ మాట్లాడుతూ.‘ఇంటి వద్ద ఈత కొడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ రోజు జెయింట్ స్టింగ్రేను నీటిలో విడుదల చేయడం కూడా అంతే ఆనందంగా, అద్భుతంగా ఉంది’ అని పేర్కొంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube