కాల్‌ డేటా చార్జీలు : మళ్లీ పాత రోజులు రాబోతున్నాయా?  

Call Data Charges Coming Soon-call Data,idea,reliance,vodafone

మూడు సంవత్సరాల క్రితం వరకు ఇండియాలో కాల్‌ చార్జీలు మరియు డేటా చార్జీలు భారీ ఎత్తున ఉండేవి.ఒక జీబీ డేటాకు ఏకంగా వందల రూపాయలు ఖర్చు చేసిన దాఖలాలు ఉన్నాయి.ఇప్పుడు రెండు వందల రూపాయలకు నెల రోజుల పాటు రోజుకు ఒక జీబీ చొప్పున డేటా ఇస్తున్నారు.ప్రస్తుతం జియోతో పాటు ఇతర అన్ని టెలికాం సంస్థలు కూడా భారీ ఎత్తున కాల్‌ చార్జీలు మరియు డేటా చార్జీలు పెంచేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Call Data Charges Coming Soon-call Data,idea,reliance,vodafone-Telugu Trending Latest News Updates Call Data Charges Coming Soon-call Idea Reliance Vodafone-Call Data Charges Coming Soon-Call Idea Reliance Vodafone

ఇప్పటికే వోడాఫోన్‌ మరియు ఎయిర్‌టెల్‌లు కాల్‌ చార్జీలు మరియు డేటా చార్జీలు పెంచేశాయి.ఇక ఇన్‌ కమింగ్‌ కాల్స్‌కు కూడా చార్జీలను వర్తింపజేయబోతున్నారు.ప్రతి నెల 45 రూపాయల రీచార్జ్‌ తప్పనిసరి చేయడంతో పాటు కాల్‌ చార్జీలు పెంచడం జరిగింది.జియో కూడా త్వరలోనే ఈ వసూళ్లను మొదలు పెట్టబోతుంది.

జియో నెట్‌వర్క్‌లో ఉన్న వారు ఇప్పటి వరకు ఉచిత ఇన్‌కమింగ్‌ మరియు ఔట్‌ గోయింగ్‌ను పొందుతూ వస్తున్నారు.కాని ఇకపై భారీ మొత్తంలో చెల్లించాల్సి రావచ్చు.అయిదు ఆరు సంవత్సరాల క్రితం ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌ నిమిషానికి రూపాయి ఉండేది.మరో ఒకటి రెండు సంవత్సరాల్లో మళ్లీ అదే తరహా కాల్‌ చార్జీలు వస్తాయేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.