కాలిఫోర్నియా: 3 వేల ఏళ్ల నాటి వృక్షాల కోసం.. కార్చిచ్చుకు ఎదురెళ్లిన అగ్నిమాపక సిబ్బంది

గడిచిన కొన్నేళ్లుగా అమెరికాలో కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి.గతం సంగతి పక్కనబెడితే.

 California Wildfires: Firefighters Wrap Blanket Around Worlds Oldest Tree , Joe-TeluguStop.com

గత రెండేళ్లుగా ఈ దావాగ్ని లక్షలాది హెక్టార్ల అటవీని కాల్చిబూడిద చేసింది.ఇదొక్కటే కాదు దీని వల్ల వన్య ప్రాణులు సైతం బూడిద కుప్పగా మారాయి.

ఇక ఇళ్లు , ఆస్తులు, వాహనాలు కోల్పోయి నిరాశ్రయులైన వారి సంఖ్య లెక్కేలేదు.ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కార్చిచ్చులపై ఫోకస్ పెట్టారు.

దావాగ్ని వల్ల భారీగా నష్టపోయిన ప్రాంతాల్లో పునర్నిర్మాణ చర్యలు చేపట్టాలని ఆయన భావిస్తున్నారు.అయినప్పటికీ దేశంలో కార్చిచ్చులు రేగుతూనే వున్నాయి.

ఈ క్రమంలో కాలిఫోర్నియాకు చెందిన అగ్నిమాపక సిబ్బంది అడవులను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు.

స్వార్ధం, వ్యాపారాలు, గనుల కోసం మనుషులు అడవులను ధ్వంసం చేస్తున్నారు.

కానీ కొందరు మాత్రం మానవాళి మనుగడ వుండాలంటే వృక్షాలను రక్షించాలని పోరాటం చేస్తున్నారు.భారతదేశంలో సుందర్ లాల్ బహుగుణ వంటి పెద్దలు చిప్కో ఉద్యమం ద్వారా అడవులను రక్షించి , వాటి ప్రాధాన్యతను దేశానికి తెలియజేశారు.

చెట్టును ఆలింగనం చేసుకుని దానిని నరుకుతున్న వ్యక్తికి సవాల్ విసిరాడు బహుగుణ.

Telugu Aluminum Foil, America, Calinia, General Sherman, Giant, Joe Biden, Sequo

ఇక అసలు మేటర్‌లోకి వెళితే.కాలిఫోర్నియాలోని గైయింట్‌ అడవులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంగతి తెలిసిందే.వీటిని చూడటానికి ప్రతియేటా ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది ప్రకృతి ప్రేమికులు తరలివస్తుంటారు.

అలాంటి గైయింట్‌ అడవిలో గురువారం ఒక్కసారిగా కార్చిచ్చు రగిలి వేల ఏళ్ల నాటి మహా వృక్షాలను సైతం కబళించబోయింది.అయితే అగ్నిమాపక సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై ఆ విధ్వంసాన్ని అడ్డుకున్నారు.

వందలాంది మంది అగ్నిమాపకు సిబ్బంది సుమారు మూడువేల ఏళ్ల నాటి మహా వృక్షాలను అగ్నికి ఆహుతి కాకుండా తమ సర్వసక్తులు ఒడ్డి కాపాడారు.

Telugu Aluminum Foil, America, Calinia, General Sherman, Giant, Joe Biden, Sequo

సీక్వొయా నేషనల్‌ పార్కులో ఉన్న ప్రపంచపు అతిపెద్ద వృక్షం జనరల్‌ షెర్మన్‌ను కాపాడేందుకు ఫైర్‌ఫైటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఈ మహావృక్షం కాండం అడుగుభాగానికి వేడిని నిలువరించగల అల్యూమినియం రేకును చుట్టారు.ఈ మహావృక్షం ఎత్తు 275 అడుగులు, చుట్టుకొలత 103 అడుగులు.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు, పర్యావరణ వేత్తలు అగ్నిమాపక సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.గైయింట్‌ అడవిలో దాదాపు రెండు వేల ఏళ్ల నాటి మహా వృక్షాలు ఉండగా.

అందులో ఒక ఐదు వృక్షాలు దాదాపు 3 వేల ఏళ్ల క్రితం నాటివని వృక్షశాస్త్ర నిపుణులు తెలిపారు.అంతేకాదు ఇవి ప్రపంచంలోనే అతి పెద్ద వృక్షాలు.వీటి పొడవు 83 మీటర్లు (275 అడుగులు).

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube