విడ్డూరం : అదో రంగుల ప్రపంచం, అక్కడ ఉండేవారు మనుషులే కాని మనుషుల్లా కాదు

ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి బాధలు లేని జీవితం, ఆర్థిక ఇబ్బందులు లేని జీవితాన్ని, అన్ని విధాలుగా ఒకరికి ఒకరు తోడుగా ఉండే జీవితాన్ని కోరుకుంటారు.కాని అలాంటి జీవితాలు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి సాధ్యం కాదని ఇన్నాళ్లు అనుకున్నాం.

 California Slab City House Rent-TeluguStop.com

కాని నాకు తెలిసిన ఒక సిటీ గురించి మీకు తెలిస్తే అర్రె నేను అక్కడ ఉంటే బాగుండేది కదా అనుకుంటారు.అక్కడ మనుషులు అంతా ఒక్కటే, అక్కడ ఉండేందుకు రెంట్‌ ఇవ్వనక్కర్లేదు, ఇల్లు కట్టుకోనక్కర్లేదు.

సమాజంలో హోదా కోసం పోరాడాల్సిన అక్కర్లేదు.

ఇలా ప్రతి ఒక్కరు కూడా అక్కడ మనుషులు కాకుండా ఒక మూగ జీవాలు ఎలా అయితే బతుకుతాయో ప్రశాంతంగా అలాగే బతికేస్తారు.

కాని వారు మనుషులే.అది కూడా మామూలు మనలాంటి మనుషులే.

వారు ఏదో గ్రహం మీద కూడా లేరు.అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోనే ఉన్నారు.

వారు ఉండే సిటీ పేరు స్లాబ్‌ సిటీ.ఈ సిటీలో ఉండేది దాదాపు 500 మంది జనాభ.

సిటీ అనగానే ఏదో గొప్ప నగరం అని, పెద్ద పెద్ద భవనాలు ఉంటాయని ఊహించుకోవద్దు.ఎందుకంటే ఆ సిటీ ఒక ఎడారి.

ఎడారీలో చాలా ఏళ్ల క్రితం ఆర్మీ వారి కోసం కట్టిన బేస్‌ క్యాంప్‌ను ఇప్పుడు జనాలు నివాసంకు ఉంచుకుంటున్నారు.

Telugu Calinia Slab, Othebills, Telugu Ups-

అమెరికా వారు రెండవ ప్రపంచ యుద్ద సమయంలో ఆ ఎడారిలో బేస్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.యుద్దం తర్వాత ఆ బేస్‌ క్యాంపును సైనికులు ఖాళీ చేశారు.దాంతో ఆ పెద్ద భవనాలు అలాగే ఉండిపోయాయి.

వాటిలో మెల్ల మెల్లగా జనాలు నివాసం ఉండటం మొదలు అయ్యింది.అక్కడ నివాసం ఉండేవారికి ప్రభుత్వంతో అస్సలు పనిలేదు.

వారు ఎలాంటి ట్యాక్స్‌లు కట్టరు.ప్రభుత్వం నుండి వారికి ఎలాంటి వసతులు లేవు.

కరెంట్‌ కూడా సోలార్‌ ద్వారా వీరు తయారు చేసుకుంటారు.

Telugu Calinia Slab, Othebills, Telugu Ups-

అక్కడ ఎవరికి అవసరం వచ్చినా కూడా ఇతరులు అంతా కూడా కలిసి కట్టుగా ముందుకు వస్తారు.ఒకరికి ఒకరు సాయంగా నిలుస్తారు.ప్రతి ఒక్క పనిని అంతా కలిసి చేసుకుంటారు.

అక్కడ ఇళ్లలో ఉండే వారు ఎన్నాళ్లయినా రెంట్‌ లేకుండా హాయిగా ఉండవచ్చు.వీరు మనుషులే కాని మనుషుల మాదిరిగా ఆర్థిక ఇబ్బందులు మరియు ఇతరత్ర కారణాలతో ఇబ్బందులు పడరు.

అందుకే ఇలాంటి ప్రపంచంలో ఉండాలి అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube