కరోనా ఎఫ్ఫెక్ట్ : అమెరికాలో 8వేల మంది ఖైదీలు విడుదల..!!!!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా అగ్ర రాజ్యం అమెరికాలోనే ఎక్కువగా కనిపిస్తోంది.కరోనా విషయంలో అమెరికా ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం కారణంగా లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

 America Releases Prisoners, California, Corona Effect, Telugu Nri News-TeluguStop.com

ఈ వ్యాధి పై సరైన అవగాన కల్పించక పోవడంతో ఇబ్బడి ముబ్బడిగా వ్యాధి గ్రస్తులు పెరిగిపోయారు.ఇదిలాఉంటే ఈ వైరస్ వ్యాప్తి అమెరికాలోని కాలిఫోర్నియా జైళ్లకి విస్తరించడంతో స్థానిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

కాలిఫోర్నియా జైళ్లలో ఉన్న సుమారు 8 వేల మందిని త్వరలోనే విడుదల చెయనున్నట్టుగా ప్రకటించింది.వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ కరక్షన్స్ అండ్ రిహాబిలిటేషన్ చెప్పిన వివరాల ప్రకారం.రాష్ట్ర పరిధిలో జైళ్లలో ఉన్న వారిలో సుమారు 2286 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రెండు రోజుల క్రితం సుమారు 30 మందికి పైగా మరణించారని తెలిపింది.అయితే

జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారిలో 180 రోజులకంటే తక్కువ శిక్ష పడిన వారిని విడుదల చేస్తున్నామని, ఆగస్టు నెలాఖరు లోగా 4800 మందిని విడుదల చేస్తున్నామని తెలిపింది.ఇదిలాఉంటే ఈ నిర్ణయంపై ఆరోగ్య నిపుణులు, ఖైదీల కుటుంభ సభ్యులు, న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం మీరు తీసుకున్న నిర్ణయం ఎంతో అద్భుతంగా ఉందిని ప్రజా సంఘాలు సైతం కృతజ్ఞతలు తెలిపాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube