అమెరికాలో అంతర్జాతీయ సదస్సుకి భారత్ నుంచీ గీతామూర్తి..!!!!

అమెరికాలో నిర్వహించే పలు అంతర్జాతీయ వేదికలకి, లేదా పలు సంస్కరణల అధ్యయనానికి భారత్ నుంచీ ఎంతోమంది నిపుణులు హాజరవుతూ ఉంటారు.ఎంతో మంది భారతీయులకి అమెరికా నుంచీ పలు ఆహ్వానాలు కూడా అందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

 California International Conference Invited Geetha Murthy-TeluguStop.com

అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు కూడా పలు వేదికలపై తమ భావాలని ప్రకటిస్తూ ఉంటారు.ఇలాంటి అవకాశమే,

ఇండియాలోని బేటీ బచావో బేటీ పడావో రాష్ట్ర కన్వినర్ గీతా మూర్తికి వచ్చింది.

అమెరికాలోని కాలిఫోర్నియా లో 29 న జరిగే అంతర్జాతీయ సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు.ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది.

ఇందులో పాల్గొన డానికి తెలుగు అసోసియేషన్ నుంచీ ఆహ్వాన లేఖ గీతామూర్తికి అందింది.

ఈ సదస్సులో మహిళ సాధికారత, మొదలగు అంశాలపై గీతామూర్తి ప్రసంగించనున్నారు.

ఈ సందర్భంగా గీతామూర్తి విలేఖరులతో మాట్లాడుతూ, సెప్టెంబర్ 25 న ఈ సదస్సులో పాల్గొనడానికి అమెరికా వెళ్తున్నానని తెలిపారు.ఈ సదస్సుకి ఆహ్వనం అందించడం ఎంతో సంతోషంగా ఉందని 15 రోజుల పాటు అమెరికా పర్యటన ఉంటుందని, పలు కీలక అంశాలపై అసోసియేషన్ తో చర్చిస్తానని ఆమె తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube