పాకిస్థాన్ లాగానే అగ్రరాజ్యం అమెరికా లో కూడా,మాస్క్ లు అడిగారని

ఆ మధ్య పొరుగుదేశం పాకిస్థాన్ లో వైద్య సిబ్బంది పీపీఈ కిట్స్ ను అడుగుతున్నారు అని ఏకంగా 50 మంది వైద్య సిబ్బందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న పాక్ లో ఈ కిట్స్ ను అందించడం లో అక్కడి ప్రభుత్వం విఫలమైంది.

 California Hospital Reinstates Suspended Nurses Who Demanded Masks California H-TeluguStop.com

అయితే ఆర్ధిక ఇబ్బందులు ఉన్న పాక్ లోనే ఈ పరిస్థితి ఉందనుకుంటే ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా లో కూడా వైద్య సిబ్బందికి ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది.అగ్రరాజ్యం అమెరికా లో రోజు రోజుకు కరోనా ఉదృతి మరింతగా పెరుగుతున్న విషయం తెలిసిందే.

దీనితో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కూడా కుదేలౌతుంది.ఈ మహమ్మారి వైరస్ నుంచి బయటపడేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ మహమ్మారి గాల్లో వ్యాపించదు అని, ఎవరికీ అయితే ఈ వైరస్ సోకుతుందో వారిని ఎవరైతే ముట్టుకుంటారో వారికే ఈ వైరస్ అనేది సోకి అలా చైన్ యాక్షన్ లాగా మరికొందరికి వ్యాపిస్తుంటుంది.

కరోనా రోగులకు చికిత్స అందించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

కరోనా పేషేంట్స్ కు కనీసం మూడు మీటర్ల దూరం వరకు కరోనా వైరస్ ఉంటుంది.అందుకే పూర్తి స్థాయి రక్షణ కలిగిన పీపీఈలు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.

అదే విధంగా ఎన్ 95 మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా అనేది వైద్య సిబ్బందికి సోకకుండా ఉండే అవకాశం ఉంటుంది.

అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఎన్ 95 మాస్కుల కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది.దీనితో అగ్రరాజ్యం అమెరికా లో సైతం ఈ మాస్క్ ల కొరత ఏర్పడింది.

కొన్ని హాస్పిటల్స్ లో ఈ మాస్కులు అనేవి అసలు అందుబాటులోనే ఉండటం లేదు.అమెరికాలో కూడా ఈ మాస్కులు దొరక్క వైద్య సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారట.

అయితే ఇటీవల కాలిఫోర్నియా ఆసుపత్రి లోని కరోనా వార్డుల్లో పనిచేసే నర్సులు పదిమంది ఎన్ 95 మాస్కులు అడిగారని అక్కడి అధికారులు సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.సోషల్ మీడియాలో దీనికి సంబందించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అగ్రరాజ్యం అమెరికా లోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఇక మిగిలిన దేశాల్లో పరిస్థితి గురించి అందరికీ అర్ధమయ్యే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube