ఓ వైపు మరణ మృదంగం.. కాలిఫోర్నియా బీచ్‌లు కిటకిట: సీరియస్ అయిన ప్రభుత్వం

అమెరికాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది.రెండు రోజులపాటు అక్కడ కాస్త శాంతించినట్లు కనిపించినా గురువారం మళ్లీ విజృంభించింది.

 America, Corona Virus, Federal Bureau Of Prisons, Lock Down, Gavin Newsom, Calif-TeluguStop.com

తాజాగా 24 గంటల వ్యవధిలో 2,502 మంది కోవిడ్ 19 బారినపడి ప్రాణాలు కోల్పోయారు.సరిగ్గా ఇదే సమయంలో అమెరికాలోని పలు జైళ్లలో సుమారు 2 వేల మంది ఖైదీలకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ వెల్లడించింది.

వైద్య పరీక్షలు నిర్వహించిన 2,700 మందిలో 2,000 మంది వైరస్ బారినపడ్డారని తెలిపింది.

ఇప్పటి వరకు అమెరికాలో కోవిడ్ 19తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60 వేలకు చేరుకుంది.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ప్రజలు వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.ఈ నేపథ్యంలో ఇళ్లలోనే ఉండాలన్న ఆంక్షలను ధిక్కరిస్తూ వేల మంది బీచ్‌లకు పోటెత్తుతున్నారు.

అసలే దేశంలో కోవిడ్ విలయతాండవం చేస్తున్న సమయంలో బీచ్‌లలో జనం తాకిడితో ప్రభుత్వం ఉలిక్కిపడింది.

ప్రజారోగ్య మార్గదర్శకాలను ధిక్కరించడంపై కాలిఫోర్నియా గావర్నర్ గావిన్ న్యూసోమ్ సీరియస్ అయ్యారు.

రాష్ట్ర దక్షిణ భాగంలోని ఆరెంజ్ కౌంటీలోని బీచ్‌లు, ఉద్యానవనాలు మూసివేయాలని ఆయన గురువారం ఆదేశాలు జారీ చేశారు.బీచ్, పార్క్‌ల కారణంగా కరోనా వైరస్‌ మరింత మందికి సోకేందుకు కారణం అవుతుందని కాలిఫోర్నియా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube