మనిషిలా, కుక్కలా ప్రవర్తిస్తున్న ఆవుదూడ.. స్థానికులు ఏమంటున్నారో తెలిస్తే అవాక్కవుతారు

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి.ఆ వింతలు ఎప్పటి నుండో జరుగుతున్నా కూడా ఈమద్య కాలంలో వింతల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నాం.

 Calf Behaving Like Human And Dog-TeluguStop.com

ఎందుకంటే సోషల్‌మీడియా పరిధి చాలా పెరగడం వల్ల జనాలు చిన్న విషయాలను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం జరుగుతుంది.అలా కొన్ని వింతైన సంఘటనలు ఈ ప్రపంచంకు అలాగే తెలుస్తున్నాయి.

తాజాగా తమిళనాడుకు చెందిన ఒక ఆవు దూడ ప్రవర్తిస్తున్న తీరు చాలా విచిత్రంగా అనిపిస్తుంది.ఆ ఆవు దూడ గురించి స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో అది కాస్త వైరల్‌ అయ్యింది

మనిషిలా, కుక్కలా ప్రవర్తిస్త�

పూర్తి వివరాల్లోకి వెళ్తే… తమిళనాడుకు చెందిన వేలూరు జిల్లాలోని ఆంబూరులో ఒక ఆవు దూడ జన్మించింది.అది పుట్టి కొన్ని వారాలు అయిన తర్వాత దాని ప్రవర్తన యజమానులకు చాలా విచిత్రంగా అనిపించింది.ఎన్నో సంవత్సరాలుగా ఆవులను పెంచుతున్న వారికి ఆ దూడ ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపించి అసలు ఆ దూడ ఎందుకు ఇలా వ్యవహరిస్తుందని ఆలోచిస్తున్నారు.

ఇంతకు ఆ దూడ ఏం చేస్తుందంటే పెంపుడు కుక్క మాదిరిగా ఎప్పుడు ఇంట్లో ఉంటూ, ఇంట్లో వారి వద్ద కూర్చుంటూ, వారితోనే ఎక్కువ సమయం ఉండేందుకు ఆసక్తి చూపుతుంది.బయట ఉండకుండా ఎక్కువ ఇంట్లోనే ఉంటుంది.

మనిషిలా, కుక్కలా ప్రవర్తిస్త�

ఇక ఈ దూడ ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం లేదు.మంచం లేదా చాప పరిచి దిండు వేసిన చోటే ఈ దూడ పడుకుంటుంది.లేదంటే అలాగే నిల్చుని ఉంటుంది.యజమాని పడుకుంటే పక్కకు వచ్చి పడుకుంటుంది.ఇక ఈ దూడ తినే తిండి చాలా ఆశ్చర్యంను కలిగిస్తుంది.సాదారణంగా ఆవులు గడ్డి తింటాయి, చిరు తిండి తినవు, కాని ఈ దూడ మాత్రం గడ్డి తినకుండా మనుషులు తినే చిరుతిండి తింటుంది.

మొత్తానికి ఈ దూడ కొన్ని సార్లు మనిషిల మరి కొన్ని సార్లు కుక్కలా వ్యవహరిస్తుంది.దీని ప్రవర్తనతో స్థానికులు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ దూడ మామూలు దూడా కాదని, దైవ రూపం అంటున్నారు.మరి కొందరు గత జన్మలో మనిషి అయ్యి ఉంటుంది, మనిషి లక్షణాలు ఈ దూడలో ఇంకా ఉన్నాయని చెబుతున్నారు.

మొత్తానికి ఆ ఆవు దూడ యజమానులను స్థానికంగా ఫేమస్‌ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube